Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమం పెడితే కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ చేసే వ్యాఖ్యలు మాత్రం సంచలనగా మారుతూ ఉంటాయి. అయితే ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో అధికార ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు తనదైన శైలిలోనే సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్న ఘటన గురించి జగన్ మాట్లాడారు.
ఇలా పోలీస్ యంత్రాంగం సహాయంతో కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు మానుకోవాలని సూచించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధపడిన కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంటే వారిని ఆపడం నావల్ల కూడా కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.
అక్రమంగా అరెస్టయి అనుభవిస్తున్న బాధ వారికి మాత్రమే తెలుస్తుంది. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు తిరగబడితే వారిని అడ్డుకోవడం నావల్ల కాదు అంటూ ఈయన మాట్లాడిన తీరు ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మరోవైపు కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారని కూడా తెలుస్తోంది.
గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాలలో అధికార పార్టీకి, అధికారులకు “తాట తీస్తాం”, “వదిలిపెట్టం” వంటి ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం చూశాం. అయితే, జగన్మోహన్ రెడ్డి తాజా హెచ్చరిక వాటికి పూర్తి భిన్నంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన మాటలతో బెదిరించకపోయిన,తప్పుడు రాజకీయాల వల్ల ఉత్పన్నమయ్యే తీవ్ర పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.