ఎప్పటికప్పుడు పార్టీని చైతన్యం చేయడంతోపాటు.. పార్టీలో నూతనోత్తేజం నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోసారి యువ రాగం వినిపించారు. త్వరలోనే పార్టీ సంస్థా గత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ దఫా తొలిసారి.. పార్టీ పార్లమెంటరీ వారీగా ఎన్నికలు నిర్వహించి నాయకులకు పదవులు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని కూడా వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో పదవులుఈ దఫా కూడా.. యువతకు ఇవ్వనున్నట్టు చంద్రబాబు చెప్పారు. దాదాపు 40 శాతం మంది యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇటీవల నాయకులతో నిర్వహించిన.. వీడియో కాన్ఫరెన్సులో ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీలో ఇప్పటికే సీనియర్లు చాలా మందికి పదవులు ఇచ్చామన్న చంద్రబాబు.. వారి పనితీరుపై అసంతృప్తి ఉందన్నారు. ఎవరూ పార్టీ కోసం పెద్దగా కష్టప డుతున్న దాఖలాలు కనిపించడం లేదని అంటున్నారు.
ఈ క్రమంలోనే యువతకు అవకాశాలను కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరోసారి పరు గులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి రెండు సూత్రాల ఫార్ములాను కూడా చంద్రబాబు వెల్లడించారు. 1) ఇప్పటికే పార్టీలో ఉండి, పార్టీకోసం పనిచేస్తున్న యువ త: వీరికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. మరింతగా పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత పుంజుకుని అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
2) కొత్తగా యువతను చేర్చుకుని: పార్టీలోకి కొత్తగా మరింత మంది యువతను చేర్చుకునేందుకు చంద్ర బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. వీరిని ఉన్నతస్థాయి విద్యావంతుల నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్నవారు.. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నవారిని పార్టీలోకి చేర్చుకుంటారు. తద్వారా.. వీరికి డిజిటల్ బేస్డ్ బాధ్యతలను అప్పగిస్తారు. వీరు ఇంటి నుంచి పనిచేసుకున్నా అంగీకరించ నునట్టు చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. మొత్తంగా.. ఈ రెండు రకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లడంతోపాటు.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడ్ కార్పెట్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.