విలాసవంతమైన నగరాలు అంటేనే అధిక డబ్బులు ఖర్చు పెట్టే నగరాలుగా ప్రసిద్ధి. వీటిని ఖరీదైన నగరాలు అని కూడా చెప్పొచ్చు. అయితే సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. జూలియస్ బేర్ అనే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వరుసగా మూడో సారి కూడా సింగపూర్ టాప్ ప్లేస్ సాధించింది.
జూలియస్ బేర్ అనే విదేశీ సంస్థ ఇచ్చిన వార్షిక నివేదిక ప్రకారం.. ప్రస్తుతం సింగపూర్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు సాధించింది. సింగపూర్ వరుసగా మూడో సంవత్సరం ఈ ఘనతను సొంతం చేసుకుని అరుదైన రికార్డు నెలకొల్పింది.
కనీసం 1 మిలియన్ డాలర్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, వారు అనుభవిస్తున్న లగ్జరీ ఆధారంగా ప్రజల జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ అనే విదేశీ సంస్థ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య సేకరించిన డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు జూలియస్ బేర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో లండన్.. మూడో స్థానంలో హాంకాంగ్ ఉన్నాయి. గతేడాది హాంకాంగ్ రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు దాన్ని పక్కకు నెట్టి లండన్ రెండో స్థానానికి చేరుకుంది. వన్ మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు, వాళ్లు కొనుగోళు చేస్తున్న వస్తువులు, అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా వారి జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది.
ఇక సింగపూర్.. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ అని పిలుస్తారు. ఇది ఒక చిన్న ద్వీపం, నగరం అలగే దేశం కూడా. ఇది మలేషియాకు దక్షిణ భాగంలో ఉంది. 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. సింగపూర్ దక్షిణ ఆసియాలోనే అతి చిన్న దేశం. 2023 జనాభా లెక్కల ప్రకారం సింగపూర్ జనాభా దాదాపు 60 లక్షలు.