ఢిల్లీలో గెలిచారు, బీహార్‌లో స్వీప్ చేశారు.. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కమలం పార్టీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోంది. బీహార్‌లో వర్కవుట్ అయిన ఫార్ములాను బెంగాల్‌లో ఇంప్లిమెంట్ చేసి మమతా బెనర్జీ (దీదీ) కోటను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి బీజేపీ స్ట్రాటజీ పూర్తిగా మారింది. వారి టార్గెట్ మమత కాదు, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అలాగే ఆయనపై అసంతృప్తిగా ఉన్న తృణమూల్ కేడర్.
ఈసారి బీజేపీ కింద నుంచి పైకి అనేలా స్కెచ్ వేస్తోంది. కేవలం పెద్ద లీడర్లను లాక్కోవడం కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో ఉన్న తృణమూల్ కార్యకర్తలను ఆకర్షించడంపై ఫోకస్ పెట్టారు. అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై నమ్మకం లేని, పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న వర్కర్లే బీజేపీ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. వీరిని లాక్కుంటే తృణమూల్ పునాదులు కదులుతాయని బీజేపీ నమ్ముతోంది.
అంతేకాదు, బెంగాల్‌లో ఎప్పుడూ లేని ‘కుటుంబ రాజకీయాల’ అంశాన్ని తెరపైకి తెచ్చి, అభిషేక్‌ను దీదీ వారసుడిగా రుద్దడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కాంగ్రెస్‌పై వాడిన అదే అస్త్రాన్ని ఇప్పుడు దీదీపై ఎక్కుపెట్టారు. గత ఎన్నికల్లో సువేందు అధికారి వంటి పెద్ద నేతలను చేర్చుకున్నా, ఈసారి మాత్రం ఇతర పార్టీల లీడర్లను చేర్చుకునే ఆలోచనలో బీజేపీ లేదు. వారి వల్ల ఓట్లు పెరగకపోగా, పార్టీలో అసంతృప్తి పెరుగుతుందని భావిస్తోంది. అందుకే కార్యకర్తలను పెంచుకుని, తమ క్యాడర్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికే ప్రయారిటీ ఇస్తున్నారు.

















