విశాఖ ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న మెగా సిటీ. ఒక్క మాటలో చెప్పాలీ అంటే హైదరాబాద్ తోనూ చెన్నై, ముంబై లతోనూ ధీటుగా ఎదిగే సత్తా ఉన్న పవర్ ఫుల్ సిటీ. ఆనాడు ఆంగ్లేయులు సైతం గుర్తించి అభివృద్ధి చేసిన మహా నగరం విశాఖ. అలాంటి విశాఖ గడచిన మూడు దశాబ్దాలలో శరవేగంగా ఎదుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా విభజన తరువాత ఏపీకి అతి పెద్ద దిక్కుగా ఆశా కిరణం గా మారింది అన్నది కూడా అసలైన వాస్తవం. విశాఖ ఏపీకి అనధికార రాజధాని అన్నా అతిశయోత్కి లేదు అంటారు.
ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్రమైన అభివృద్ధికి ప్రణాళికలను రచిస్తోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది కూటమి సర్కార్ ఉద్దేశ్యంగా ఉంది. అందులో ఎంతో అవకాశం ఉన్న విశాఖ మీద స్పెషల్ ఫోకస్ పెడుతోంది. విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఇక కూటమి ప్రభుత్వం అనేక ఐటీ సంస్థలను విశాఖలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఎంతో ఘనత వహించిన ప్రముఖ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఉబలాటపడడం అన్నది ఇపుడు కీలకంగా మారుతోంది.
విశాఖ మీద బాబు చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అనడంలో రెండవ మాట అయితే లేదని చెప్పాల్సిందే. గూగుల్ టీసీఎస్ వంటి ప్రముఖ దిగ్గజ సంస్థలు విశాఖలో అడుగుపెట్టడం వెనక బాబు కృషి చాలానే ఉంది. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్నది బాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఇక మంత్రివర్గ సమావేశాంలో విశాఖ ప్రగతి గురించి తనదైన విజన్ గురించి బాబు చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది.
విశాఖ 2028 నాటికి వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే అతి ముఖ్య కేంద్రంగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు. అంతే కాదు పశ్చిమ ముంబై మాదిరిగా తూర్పున విశాఖ తయారు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖ మహా నగరంగా రూపొందడమే కాదు ఒక ప్రత్యేక నగరంగా దేశంలోనే వెలుగొందుతుందని బాబు అంటున్నారు. దీనికి ఎంతో దూరం కూడా లేదని కేవలం పదిహేనేళ్ల వ్యవధిలోనే విశాఖ అద్భుతమైన మహా నగరంగా అవతరిస్తుందని బాబు గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాక నిజంగా ఒక అద్భుతమని కూడా ఆయన చెబుతున్నారు. ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సోలోగా పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులతో ఒక సంస్థ దేశంలోకి రావడం ఆ చాన్స్ ఏపీకి అందునా విశాఖకు దక్కడం అంటే విశాఖ ఈజ్ గ్రేట్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం విషయంలో చంద్రబాబు చేసిన కృషికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో ప్రశంసించారు. బాబు మార్క్ విజన్ ఇదని మంత్రులు కూడా కొనియాడుతున్నారు. ఏది ఏమైనా బాబు అమరావతితో పాటు విశాఖను కూడా అత్యద్భుతంగా రేపటి తరానికి అందించే విషయంలో పూర్తి ఫోకస్ పెట్టారన్నది వాస్తవం అని చెబుతున్నారు.
ఈ దెబ్బతో ఉత్తరాంధ్ర దశ తిరగడమే కాదు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కూటమి సర్కార్ పాలసీలు ఉన్నాయని అంటున్నారు. సో విశాఖ వాసులంతా గర్వించి ఆనందించాల్సిన సమయం సందర్భం వచ్చేసింది అన్న మాట.