మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా లాంటి హీరోయిన్స్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో సినిమా అంతకంత లేట్ అవుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ చరణ్ సినిమా కోసం అది వాయిదా వేశారు.
సినిమా పూర్తైందని ఓ పక్క మేకర్స్ అంటూనే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పని ఇంకా ఉందని అంటున్నారు. విశ్వంభర సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే సినిమా వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదని తెలుస్తుంది. హాలీవుడ్ టీం తో విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు అవే చాలా కీలకమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ లేట్ అయితే సినిమా ఈ ఇయర్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు.
అంతేకాదు మెగా స్టార్ 156వ సినిమాగా రాబోతున్న విశ్వంభర సినిమా కన్నా 157వ సినిమాగా చేస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. విశ్వంభర సినిమా విషయంలో డైరెక్టర్ వశిష్టకు మెగా బాస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు టాక్. సినిమాను అతను ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడో అప్పటిదాకా తన సపోర్ట్ ఇచ్చేలా చూస్తున్నార్ట. అందుకే వశిష్ట కూడా విశ్వంభర మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది.
సో విశ్వంభర సినిమా సంక్రాంతి మిస్సైంది సమ్మర్ ని మిస్ చేస్తుంది అని లెక్కలేసుకుంటున్న మెగా ఫ్యాన్స్ కి ఈ ఇయర్ సినిమా రిలీజ్ కష్టమే అన్న ఆలోచన మేకర్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కచ్చితంగా మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే విషయమే అని చెప్పొచ్చు. ఒకవేళ విశ్వంభర లేట్ అయినా కూడా అనిల్ రావిపూడి సినిమా మాత్రం అనుకున్నట్టుగా 2026 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ ఉందని తెలుస్తుంది. మరి చిరు సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమా ఈ రెండి మీద మెగాస్టార్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఇలానే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పెండింగ్ వల్ల మరో స్టార్ సినిమా కూడా రిలీజ్ ఎప్పుడన్న సందిగ్ధ పరిస్థితిలో ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్లే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని టాక్. మారుతి కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు.