తొలి పరిచయం ఎప్పటికీ పదిలమే. అది స్నేహమైనా? ప్రేమ అయినా! ఆ స్నేహమే ప్రేమగా వికసిస్తే ఆ వేదిక మరింత ప్రత్యేకం. ఎన్ని దశాబ్దాలైనా మదిలో చెరగని ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి ఓ వేదిక విశాల్-సాయిధన్షికల జీవితంలో కూడా ఉందా? అంటే ఉందనే తెలుస్తోంది. విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి చేసే వరకూ పెళ్లి చేసుకోనున్నారు. ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత అందులోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. నటీనటుల సంఘానికి ఇచ్చిన మాటకు కట్టుబడి అంతే కమిట్ మెంట్ తో ఆ బిల్డింగ్ కట్టడం చివరి దశకు చేరుకుంది.
ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. మరో రెండు నెలల్లో నిర్మాణం పూర్తవ్వగానే అందులో పెళ్లి భాజాలు మోగనున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల ప్రేమకు వివాహ బంధంతో చెక్ పెడుతున్నారు. ఓ పెద్ద సెలబ్రిటీ అయినా? విశాల్ నడిగర్ బిల్డింగ్ లో పెళ్లి చేసుకోవడం ఏంటనే సందేహం చాలా మందిలో ఉంది. సెలబ్రిటీల ఇంట పెళ్లంటే? పెద్ద పెద్ద ప్యాలెస్ లో తమ స్థాయికి తగ్గట్టు చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాలకు ఎగిరి పోతుంటారు. ఇండియాలో అయితే అందుకు రాజస్తాన్ వేదికగా మారుతుంటుంది.
రాజస్థాన్ రాజభవనాల్లో అత్యంత వైభవంగా వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. జెడ బ్యూ మారియట్, తాజ్ ఆరావళి, వెస్టిన్ రిసార్ట్, వెల్కమ్ హోటల్, మన హోటల్స్, రణక్‌పూర్ ఇలా ఎన్నో స్థాయిని తెలిపే ప్రత్యేకమైన వివాహ వేదికలున్నాయి. కానీ ఇలాంటి విలాసవంతమైన వివాహాన్ని విశాల్ -సాయిధన్షికలు కోరుకోలేదు. తామెంత పెద్ద సెలబ్రిటీలైనా తొలి పరిచయ వేదికనే వివాహ వేదికగా మలుచుకున్నారు. విశాల్ కు నడిగర్ బిల్డింగ్ నిర్మాణం లో ఉన్న సమయంలోనే సాయిధన్షిక పరిచయమైంది.
తమ మొదటి ప్రేమ జ్ఞాపకాలన్నీ అక్కడే కొలువు దీరాయి. సాయి ధన్షికతో పరిచయం ప్రేమగా మారడం ..మదిలో వీణలు మ్రోగడం అన్నింటికీ అదే వేదిక. ఈ నేపథ్యంలోనే విశాల్-సాయి ధన్షికలు భవన నిర్మా ణం పూర్తికాగానే అందులోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ వివాహం నడిగర్ కొత్త భవనం చరిత్రలో నిలిచిపోతుంది. తరతరాలు ఈ వివాహం గురించి మాట్లాడుకోవడం తధ్యం.