విజయసాయిరెడ్డి తాజాగా సండె రోజున ఉత్తరాంధ్ర వచ్చి మరీ వైసీపీ మీద కొన్ని విమర్శలు చేశారు అధినేత జగన్ ని ఏమీ అనకుండానే కోటరీ మాటలు వింటున్నారు అని సెటైర్లు వేశారు. ఇది ఎలా ఉంది అంటే జగన్ మంచివారే కానీ వారి మాటలు వినడంతోనే అంతా అన్నట్లుగా. అంటే జగన్ ని ఇండైరెక్ట్ గా తప్పుడు చెప్పుడు మాటలు వింటున్నారు అనడమే అని తాత్పర్యం కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ విషయంలో సాయిరెడ్డి ఎందుకు పదే పదే కోటరీ అని అంటున్నారో ఫ్యాన్ పార్టీ నేతలకు అర్థం కాకపోయినా ఆయన రాజకీయంగా రీ ఎంట్రీ ఇస్తారు అని మాత్రం ఊహిస్తున్నారు. కోటరీ పేరుతో జగన్ తనను దూరం చేసుకున్నారు అని చెప్పడానికే విజయసాయిరెడ్డి ఇలా చేస్తున్నారు అన్నది కూడా ఉంది.
విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగడడం కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పవన్ తో తనకు రెండు దశాబ్దాల దోస్తీ ఉందని చెప్పడాన్ని నోట్ దిస్ పాయింట్ అని అంటున్నారు. అంటే పవన్ వైపు విజయసాయిరెడ్డి చూస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది. మొదట కాంగ్రెస్ నుంచి వచ్చి తరువాత వైసీపీలో చేరి కీలక స్థానానికి ఎదిగిన విజయసాయిరెడ్డి ముందు ఉన్న ఆప్షన్లు బీజేపీ టీడీపీ జనసేన అని అంటున్నారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేశాక ఆయనకు ఉన్న పరిచయాల బీజేపీలో చేరుతారు అని అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు, ఆ తరువాత టీడీపీలో చేరుతారు అని అనుకున్నా అది కూడా జరగలేదు. ఇపుడు జనసేన ఒక ఆప్షన్ ఉంది అని అంటున్నారు.
జనసేనలో విజయసాయిరెడ్డి చేరడం అన్నది వీలు అవుతుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏ సంగతీ చెప్పలేమని అంటున్నారు. అయితే జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత అన్నీ చూసుకునే నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయనే పార్టీలో మొత్తం చూస్తారు. అంటే జగన్ దగ్గర విజయసాయిరెడ్డి లా అన్న మాట అని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి వెళ్ళినా అందరిలాగానే ఒక నాయకుడిగా ఉండాల్సి వస్తుంది ఇక ఆయన అనుకున్నది కూడా అక్కడ జరుగుతుంది అని కూడా ఎవరూ చెప్పలేరు అని అంటున్నారు.
ఇక కొత్త పార్టీ పెడతాను అని విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేశారు అయితే అది ఇపుడు కాదని అన్నారు. కానీ కొత్త పార్టీ పెట్టినా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అది ఎంత వరకూ మనగలుగుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక బీహార్ లో పీకే ఉరఫ్ ప్రశాంత్ కిశోర్ కూడా పార్టీ పెట్టి తాజా ఫలితాలతో దెబ్బ తిన్నారు చాలా మంది పార్టీ పెట్టలని అనుకున్నా అదంతా ఈజీ కాదు, జనాలు అయితె కొన్ని పార్టీలకే కట్టుబడి ఉన్నారు. ఓటు షేర్ వారికి ట్రెడిషనల్ గా దక్కుతోంది. దాంతో రాజకీయంగా మంచి వ్యూహకర్త అయిన విజయసాయిరెడ్డి ఆ పని చేస్తారా అంటే డౌటే అంటున్నారు. మరి ఆయనలో చూస్తే రాజకీయ తహతహ కనిపిస్తోంది అని అంటున్నారు. అందువల్ల ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని మరి ఆ పార్టీ ఏదీ అంటేనే సస్పెన్స్ అని అంటున్నారు. సో విజయసాయిరెడ్డి తాజా ప్రకటనల మీద వైసీపీలో అయితే పెద్ద చర్చే సాగుతోందిట.
















