ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Vijayasai Reddy..కోటరీకి అనుకూలంగా ఉంటేనే..!

Vijayasai Reddy..కోటరీకి అనుకూలంగా ఉంటేనే..!
ADVERTISEMENT

కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వెల్లడించారు.

కాకినాడ పోర్టు వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారని విజయసాయి అన్నారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసని సీఐడీ అధికారులకు తాను చెప్పానని అన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేశానని తెలిపారు. పోర్టు యజమాని కేవీ రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ను కాపాడేందుకు మీరంతా యత్నిస్తున్నారా? అని సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని… ఈ కేసుతో జగన్ కు సంబంధం లేదని తాను చెప్పానని తెలిపారు.

కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని విజయసాయి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఒక రాజభవనంలో ఉండేవారని చెప్పారు. పోర్టు వ్యవహారంతో జగన్ కు సంబంధం లేదని అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పారు.

ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే అని కామన్ ఫ్రెండ్స్ తో కేవీ రావు చెప్పారని తెలిపారు. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని… సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కేవీ రావు రాజకీయ బ్రోకర్ అని… ఆయనంటే తనకు అసహ్యమని చెప్పారు.

తాను వ్యవసాయం చేసుకుంటున్నానని… ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని విజయసాయి చెప్పారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేదని… ఇప్పుడు దేవుడిపై భక్తి ఉందని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని… తాను ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. భవిష్యత్తులో తనపై విమర్శలు, ఆరోపణలు చేసినా తాను పట్టించుకోనని అన్నారు.

స్నేహంగా ఉన్నంతకాలం.. స్నేహితుల మధ్య ఏ తప్పులూ కనిపించవు. అదే స్నేహం విరిగిపోతే.. ఒప్పులు కూడా తప్పుల లాగానే కనిపిస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపులు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిని చెప్పుకోవచ్చు. తాజాగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకుంటారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో నాకు స్థానం లేదని తెలిసి వైసీపీ నుంచి బయటకు వచ్చాను. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి.

Tags: #Jagan#KakinadaPort case#KVRao#Vijayasai Reddy#VikranthReddy#Ysrcp#YV SubbaReddy
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

Next Post

Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

Related Posts

YSSharmila
Big Story

YSSharmila: “అన్న అనే పదానికే జగన్ కళంకం” | వివేకా కేసుపై ఘాటు విమర్శలు

AssemblySession
Big Story

AssemblySession:సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు | వరి ఉత్పత్తి, రాజకీయ సవాళ్లు హాట్ టాపిక్

RaashiKhanna
Entertainment

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Telangana Assembly
Big Story

Telangana Assembly:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, ఛాలెంజ్‌లు

APGovernment
Andhra Pradesh

APGovernment:ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్ ప్రయాణం, 10,000 ఉద్యోగాలతో కూటమి ప్రభుత్వ భారీ నిర్ణయాలు

NabhaNatesh
Entertainment

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

Next Post
Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

YSSharmila

YSSharmila: “అన్న అనే పదానికే జగన్ కళంకం” | వివేకా కేసుపై ఘాటు విమర్శలు

AssemblySession

AssemblySession:సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు | వరి ఉత్పత్తి, రాజకీయ సవాళ్లు హాట్ టాపిక్

UBSReview

UBSReview:ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ నటనతో మాస్ బ్లాస్టర్

RaashiKhanna

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info