ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Daggubati Venkatesh: చాలా కూల్ గా!

Daggubati Venkatesh: చాలా కూల్ గా!
ADVERTISEMENT

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లు ఎవ‌రైనా స‌రే మీడియా అటెన్ష‌న్ ఎక్కువ‌గా కోరుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా అంద‌రికీ తెలియాల‌ని, వారి గురించి జ‌నం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాల‌ని, నిరంతరం వార్త‌ల్లో నిలవాల‌నే కోరిక‌తో త‌మ గురించి తామే ప‌బ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు చాలా మంది.కానీ ద‌గ్గుబాటి హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మాత్రం అలా కాదు. ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో చాలా కూల్ గా, కామ్ గా ఉంటారనే విష‌యం తెలిసిందే. అంతేకాదు, ప‌బ్లిసిటీ పై ఆయ‌న‌క‌స‌లు ధ్యాసే ఉండ‌దు. ఎప్పుడూ కావాల‌ని వార్త‌ల్లో ఉండాల‌నుకునే ర‌కం కాదు వెంకీ. రీసెంట్ గా తాను ప‌బ్లిసిటీని ఎందుకు ప‌ట్టించుకోడ‌నేది ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు వెంకీ.

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇచ్చిన స‌ల‌హా వ‌ల్లే తాను ప‌బ్లిసిటీ గురించి అస‌లు ఆలోచించ‌న‌ని ఆయ‌న చెప్పాడు. ర‌జ‌నీకాంత్‌కు, త‌న‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ‌ని, ఆయ‌న్నుంచి తానెన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని తెలిపాడు వెంకీ. కెరీర్ స్టార్టింగ్ లో ర‌జినీ ఇచ్చిన స‌ల‌హానే తాను ఇప్ప‌టికీ పాటిస్తున్నాన‌ని వెంకీ చెప్పాడు. తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేట‌ప్ప‌టికీ ర‌జినీ హీరో అయ్యార‌ని, త‌న తండ్రి రామానాయుడుతో క‌లిసి ర‌జినీ వ‌ర్క్ చేశార‌ని చెప్పాడు వెంకీ. తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు ర‌జినీ త‌న‌తో ఓ మాట చెప్పాడ‌ని, మూవీ రిలీజ్ టైమ్ లో బ్యాన‌ర్లు క‌ట్టారా? మ‌న పోస్ట‌ర్లు ఫ్రంట్ పేజ్ లో వ‌చ్చాయా లేదా లాంటి విష‌యాల‌ను ఆలోచించొద్ద‌ని, మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ వెళ్తే చాల‌ని ర‌జినీ అన్నార‌ని వెంకీ తెలిపాడు. ర‌జినీ అప్పుడు చెప్పిన మాట‌నే తాను ఇప్ప‌టికీ ఫాలో అవుతున్నాన‌ని, అందుకే ప‌బ్లిసిటీ గురించి పెద్ద‌గా పట్టించుకోన‌ని, దేని గురించీ ఎక్కువ‌గా ఆలోచించ‌న‌ని వెంకీ చెప్పాడు. అదే ఇంట‌ర్వ్యూలో త‌న‌కు దేవుడు అంటే ఎంతో భ‌య‌మ‌ని, అరుణాచ‌లం అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పిన వెంకీ, ఘ‌ర్ష‌ణ టైమ్ లో తాను ఉన్న ప‌డ‌వ మునిగిపోయిన‌ప్ప‌టికీ దేవుడి ద‌య వ‌ల్లే ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌కుండా బ‌య‌ట‌పడిన‌ట్టు చెప్పారు.

Tags: #CelebrityWisdom#IndianCinemaIcons#InspiringCelebrities#KollywoodMeetsTollywood#LifeBeyondFame#NoPublicity#Rajinikanth#SilentStars#SimpleLivingHighThinking#SpiritualIcons#SpiritualLife#StarWithSubstance#tollywood#TollywoodLegends#Venkatesh
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

India-Pakistan :పాక్ ఎయిర్‌లైన్లకు భారత గగనతలం మూసివేత

Next Post

Amaravati : అభివృద్ధికి చిరునామాగా!

Related Posts

Chandrababu Naidu Kuppam Tour
Andhra Pradesh

Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.. అభివృద్ధే ఎజెండా, ప్రజల సంక్షేమమే లక్ష్యం

IRCTC
Big Story

IRCTC:తత్కాల్ టికెట్ బుకింగ్ వేగవంతం.. ఐఆర్‌సీటీసీ కొత్త AI వ్యవస్థతో భారీ మార్పులు

RevanthReddyMidjilSabha
Big Story

RevanthReddyMidjilSabha:రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభలో కీలక వ్యాఖ్యలు.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపు

Engineering2030 ,#FutureSkills, #ArtificialIntelligence, #AI, #EngineeringStudents, #CareerGuidance, #FutureJobs, #StartupIndia, #SkillDevelopment, #Innovation, #ProductCompanies, #Education, #Technology, #DigitalIndia, #FutureReady
Big Story

Engineering2030:ఇంజనీరింగ్ డిగ్రీల కాలం ముగిసింది.. స్కిల్స్ యుగం మొదలైంది | AI, స్టార్టప్స్, భవిష్యత్ ఉద్యోగాలపై పూర్తి విశ్లేషణ

NagabandhamReview
Entertainment

NagabandhamReview:విజువల్ వండర్‌గా మెప్పించిన విరాట్ కర్ణ.. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న మైథాలజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్

MaritalLife:బంధాలు బలహీనపడితే… బతుకులే బలైపోతాయి! సమాజం ఎటు పయనిస్తోంది
Big Story

MaritalLife:బంధాలు బలహీనపడితే… బతుకులే బలైపోతాయి! సమాజం ఎటు పయనిస్తోంది

Next Post
Amaravati : అభివృద్ధికి చిరునామాగా!

Amaravati : అభివృద్ధికి చిరునామాగా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Naidu Kuppam Tour

Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.. అభివృద్ధే ఎజెండా, ప్రజల సంక్షేమమే లక్ష్యం

IRCTC

IRCTC:తత్కాల్ టికెట్ బుకింగ్ వేగవంతం.. ఐఆర్‌సీటీసీ కొత్త AI వ్యవస్థతో భారీ మార్పులు

RevanthReddyMidjilSabha

RevanthReddyMidjilSabha:రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభలో కీలక వ్యాఖ్యలు.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపు

Engineering2030 ,#FutureSkills, #ArtificialIntelligence, #AI, #EngineeringStudents, #CareerGuidance, #FutureJobs, #StartupIndia, #SkillDevelopment, #Innovation, #ProductCompanies, #Education, #Technology, #DigitalIndia, #FutureReady

Engineering2030:ఇంజనీరింగ్ డిగ్రీల కాలం ముగిసింది.. స్కిల్స్ యుగం మొదలైంది | AI, స్టార్టప్స్, భవిష్యత్ ఉద్యోగాలపై పూర్తి విశ్లేషణ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info