మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్*
👉 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పిచ్చి లేసింది.
👉 మెదడుకు నాలుకకు కనెక్షన్ కట్ అయ్యి మాట్లాడుతున్నాడు
👉 దినం లోనే సోయి తప్పడం,మతి తప్పడం ఆయనకు అలవాటు అయ్యింది.
గత రెండు సంవత్సరాలలో R&B మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికొత్తగా ఒక గుంత పూడిచింది లేదు… ఒక్క ఇటుక పెర్చింది లేదుదుబాయ్ పోయి బోటులో షికార్లు చేయడం,SLBC పేరు మీద అమెరికా పోయి పార్టీలు చేసుకోవడం తప్ప వెంకటరెడ్డి ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదు.SLBC వెంకట్ రెడ్డి తెలివి తక్కువ తనం వల్లే కూలింది.ఇప్పటికీ చనిపోయిన వారి శవాలు కూడా బయటకు తీయలేని అసమర్తుడు కోమటిరెడ్డి రెడ్డిఉప్పల్ – నారపల్లి ఫ్లై ఒవర్ పని కేంద్రం పరిధిలోనిదనే జ్ఞానం కూడా వెంకట్ రెడ్డి కి లేదు.రెండేండ్లు అయ్యింది మీరు వచ్చి మరెందుకు ఇప్పటికీ ఉప్పల్ ఫ్లై ఓవర్ పని పూర్తి కాలేదు ?
*మీరొచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదు.*ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు (RRR) పనులకు సంవత్సరం క్రితం టెండర్లు పిలిచారు. నెల రోజుల్లోనే పనులు మొదలవుతాయి అని మీరే స్వయంగా అన్నారు. ఇంకా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు.దీనికి ఎం సమాధానం చెబుతావు వెంకట్ రెడ్డి.?దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు(RRR) విషయంలోనైతే ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.ఉట్టి మాటలు పిచ్చి వాగుడు తప్పిస్తే కోమటిరెడ్డి కి విషయ అవగాహన లేదు.
*కోమటిరెడ్డి కోతల రెడ్డిగా మారిండు.*
1 . మీ 50 సంవత్సరాల కాంగ్రేస్ పరిపాలన ఫలితంగా 2014 లో తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ రహదారులు 2.2 సగటుతో 2511 కి.మీ పొడవు ఉంటే KCR 10 ఏండ్ల హయాంలోనే అనేక కొత్త జాతీయ రహదారులు కేంద్రం నుండి తీసుకువచ్చి 4.45 సగటుకు పెంచి కొత్తగా 2472 కి.మీ పొడవు గల రోడ్లను సాదించినం.
2 . మీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో R&B లో 30 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాలు ఉంటే కేసీఆర్ హాయంలో 10 సంవత్సరాల కాలంలోనే *కోటి చదరపు* అడుగులకు పైగా కొత్త భవనాలు కట్టినం
3 . మీ 50 సంవత్సరాల కాంగ్రేస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో 6000 కి.మీ డబులు రోడ్లు ఉంటే మా 10 ఏండ్ల హయాంలోనే 8000 కి.మీ కొత్త డబుల్ రోడ్లు వేశాం. మరియు 600 కి.మీ 4 లైన్ ల రోడ్లు ఉంటే కొత్తగా 500 కి.మీ 4 లైన్ ల రోడ్లు వేశాం.
4 . నల్గొండ పట్టణంలో కావచ్చు మరియు జిల్లాలో కావచ్చు ఇప్పుడు కనిపిస్తున్న 4 లైన్ ల రోడ్లు,డబుల్ రోడ్లు నూతన భవనాలు అన్ని కూడా BRS ప్రభుత్వ హయాంలో జరిగినవే.
ఈ అన్ని విషయాలు అసెంబ్లీ సాక్షిగా నీకు ఇదివరకే చెప్పిన..నువ్వు మరిచిపోతే రికార్డులు తెప్పించి చూసుకో.ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్.మేము కొత్తగా ప్రభుత్వం లోకి వచ్చినపుడు అంతకు ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బకాయి పడ్డ బిల్లులను మేము చెల్లించినం.మీలాగా ఏడువలేదు.రెండు సంవత్సరాలు అయ్యింది ఇంకా ఎన్ని ఏండ్లు మా మీద ఏడుస్తారు ?కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం చేత కాకపోతే,మంత్రి పదవి నుండి తప్పుకో.ఇంకోసారి కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నల్గొండ ప్రజలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పిచ్చాసుపత్రి కి పంపిస్తారు.