కెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్ లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఇదే సమయంలో… ప్రస్తుతానికి ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.అవును… హర్యానాలోని 12వ తరగతి పూర్తి చేసిన వంశిక.. ఆ తర్వాత కెనడా వెళ్లింది. అన్మతరం అక్కడ రెండేళ్ల హెల్త్ డిప్లొమా కోర్సు చేసింది. కాగా.. ఏప్రిల్ 18న ఫైనల్ పరీక్షలు పూర్త్వ్వడంతో ఒట్టావాలోని ఒక కాల్ సెంటర్ పార్ట్ టైం లో చేరింది. ఏప్రిల్ 22న ఉద్యోగం కోసం బయలుదేరిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది!
స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఆమె మృతదేహం బీచ్ లో కనిపించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా… ఒట్టావాలో భారతదేశానికి చెందిన వంశిక సైనీ అనే విద్యార్థిని మరణించినట్లు తెలియగానే తాము చాలా బాధపడ్డామని తెలిపింది.ఈ సందర్భంగా స్పందించిన వంశిక సైనీ తండ్రి దేవిందర్ సైనీ.. తన కుమార్తె రోజూ తమతో మాట్లాడేదని.. కానీ, ఏప్రిల్ 22 తర్వాత ఫోన్ కూడా చేయలేదని రంధావా వెల్లడించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఆమె కనిపించడం లేదని తనకు తెలిసిందని వివరించారు. అనంతరం.. ఆమె మృతదేహం బీచ్ లో కనిపించినట్లు పోలీసులు చెప్పారని వెల్లడించారు.
వంశిక సైనీ తండ్రి దేవిందర్ సైనీ చండీగఢ్ లోని డేరా బస్సీలో నివాసముంటున్నారు. ఈయన స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నేత. ఇదే సమయంలో.. ఆ పార్టీ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రంధావాకు సన్నిహితుడు.కాగా… కెనడాలోని భారతీయులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఒంటారియో హోమిల్టన్ లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల హర్ సిమ్రత్ రాంధవా అనే విద్యార్థిని. ఇటీవల ఆమె బస్ స్టాప్ లో వేచి చూడగా.. ఆమెపై కారు నుంచి కాల్పులు జరగడంతో ఆమె మరణించింది.