విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభోత్సం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇంకా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. అక్టోబర్ లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో వెంకీకి జోడగా ఏ భామ నటిస్తుంది? అన్న దానిపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. త్రిష, రుక్మిణీ వసంత్, మీనాక్షి చౌదరి ఇలా కొంత మంది భామల పేర్లు తెరపైకి వచ్చాయి.
వీళ్లతో పాటు కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో రమణ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఏ భామకి దక్కుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. వెంకీకి జోడీగా ఎవరైతే బాగుంటుంది అన్న దానిపై రకరకాల డిస్కషన్స్ జరిగాయి. అయితే చివరిగా ఆ ఛాన్స్ శ్రీనిధి శెట్టికే వరించినట్లు తాజాగా వినిపిస్తోంది. గురూజీ రాసిన పాత్రకు శ్రీనిధి పర్పెక్ట్ సూటువుతందిట. పోటీగా రుక్మీణి వసంత్ కూడా నిలిచినప్పటికీ ఆమె కంటే నిధి అయితేనే యాప్ట్ అవుతుందని గురూజీ ఫిక్సైపోయినట్లు వినిపిస్తోంది.
దీనికి సంబంధించి మరో రెండు..మూడు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వస్తుందంటున్నారు. అదే నిజమైతే శ్రీనిధి శెట్టి స్టార్ మారినట్లే. ఇప్పటికే `హిట్ 2` లో నానికి జోడీగా నటించి మంచి హిట్ అందుకుంది. డెబ్యూ చిత్రంతోనే అమ్మడు కుర్రకారు మనసు దోచింది. సినిమాలో ఎక్కువగా ప్యాంట్..షర్టులోనే కనిపించినా? అమ్మడి అందానికి పిదాకాని వారుండరు. నేచురల్ బ్యూటీతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.
గ్లామర్ షోస్ చేయదు గానీ పద్దతైన ఫోటోలతోనూ యువత మనసు దోచేయడం నిధీ బ్యూటీ ప్రత్యేకత. `కేజీఎఫ్` లాంటి పాన్ ఇండియా హిట్ ఉన్నా? అమ్మడు తదుపరి ఛాన్సులు అందుకోవడంలో తబడపింది. కొన్ని పెద్ద చిత్రాలు చేసినప్పటికీ కంటెంట్ ఫెయిల్ అవ్వడంతో నిధి ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్రయత్నంగా మిగిలిపోయింది. మళ్లీ నాని సినిమాతో బౌన్స్ బ్యాక్ అయింది. గురూజీ ఛాన్స్ నిజమైతే టాలీవుడ్ లో భవిష్యత్ కు తిరుగుండదు.