గుంటూరు కారం వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఇక తర్వాతి ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకోబోయే నిర్ణయం గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాకు కాస్త బ్రేక్ పడడంతో, గ్యాప్ లో వెంకటేష్‌తో ఓ చేయబోతున్నారన్న కథనాలు వైరల్ అయ్యాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తేలిపోయింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా మరోసారి వాయిదా పడింది.
దీని వల్ల త్రివిక్రమ్ చేతిలో ఓ గ్యాప్ ఏర్పడింది. దాంతో ఈ లోపు ఓ చిన్న సినిమా చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వెంకటేష్‌తో ఆయన ఓ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. వెంకటేష్‌తో త్రివిక్రమ్ గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలకు రచయితగా పని చేశారు. అప్పట్లో దర్శకుడిగా మారిన తర్వాత కూడా వెంకీతో కలిసి సినిమా చేయాలన్న త్రివిక్రమ్ ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి అయితే పక్కా ప్రాజెక్ట్ సెటవుతుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో ఎలాంటి సినిమాకు కమిట్ కాలేదట. అలాగే రామ్ పోతినేని పేరు కూడా ఈ కాంబో న్యూస్ లో బాగానే వైరల్ అయ్యింది. అందుకు కారణం స్రవంతి రవికిషోర్ కు ఇచ్చిన మాట.
ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకుడిగా మొదటి ఛాన్స్ అందుకుంది ఆయన నిర్మాణంలోనే. నువ్వే నువ్వే ద్వారా త్రివిక్రమ్ కెరీర్ మొదలైంది. ఇక ఆ తరువాత మళ్ళీ వారి కలయికలో సినిమా రాలేదు. ఇక ఆ బ్యానర్ ఫ్యామిలీ హీరో రామ్ తోనే ఒక సినిమా చేయాలని చాలాసార్లు చర్చలు జరిపారు. త్రివిక్రమ్, రామ్‌ల మధ్య ఓ యూత్ ఫుల్ మూవీ ఒకటి చర్చల్లో ఉందని కొంతమంది చెబుతున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా ఊహాగానాలేనని త్రివిక్రమ్ టీం క్లారిటీ ఇచ్చింది. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ ఫైనల్ చేయడంపైనే ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఇక అట్లీ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే బన్నీ తిరిగి త్రివిక్రమ్ సినిమాకు కేటాయించనున్నాడు. దాంతో ఆ సినిమా ఇంకా కనీసం ఏడాది టైమ్ పట్టే అవకాశముంది. ఆ లోపు త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ మరింత పవర్ఫుల్ గా సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ కావాలి అంటే ఆమాత్రం టైమ్ కేటాయించాల్సిందే.