అందాల త్రిష పెళ్లి వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో కొన్నేళ్ల క్రితమే జరగాలి. అది ప్రేమ వివాహం కావాలి. కానీ అనూహ్యంగా నిశ్చితార్దం తర్వాత మనస్పర్దులు రావడంతో ఆ బంధానికి అక్కడితో పుల్ స్టాప్ పెట్టారు. అటుపై త్రిష వృత్తి పరంగా బిజీ అయింది. ప్రేమ, పెళ్లి అనే మాట లేకుండా నటిగా సినిమాలు చేసుకుంటూ ప్రయాణం సాగిస్తోంది. మధ్య మధ్యలో మాత్రం మనసుకు నచ్చిన వాడు దొరికితే తప్పక పెళ్లి చేసుకుంటానని స్టేట్ మెంట్లు ఇస్తోంది.
పెళ్లికి తానెంత మాత్రం వ్యతిరేకిని కాదని..అందరిలాగే తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని..పిల్లల్ని కనాలని…కుటుంబ జీవితం గడపాలని ఉందని వెల్లడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తాను అనుకున్నది ఆలస్యమయ్యే సరికి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. సెలబ్రిటీ జీవితంలో ఇవన్నీ సహజమే. ఒకరికి దూరమైన తర్వాత మరొకరకు దగ్గర కాకుండా ఉంటారా? మనసుకు నచ్చిన వాడు కుదరకపోతాడా? అనే ప్రచారం సహజంగా జరిగేదే. ఈ నేపథ్యంలో త్రిష పెళ్లిపై మీడియాలో చాలా కాథనాలు వైరల్ అయ్యాయి.
ప్రముఖంగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం సెట్ చేసారని…త్రిష కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందనే ప్రచారం ప్రముఖంగా నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. దీన్ని త్రిష ఖండించింది. అటుపై స్నేహితుడితో దిగిన ఫోటో విషయంలోనూ ఇలాంటి ప్రచారమే తెరపైకి వచ్చింది. స్నేహితుడిని బోయ్ ప్రెండ్ గా అంటగట్టి జరిగిన ప్రచారంపై అమ్మడు మాత్రం కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది. త్రిష రియాక్షన్ తో అవన్నీ కట్టు కథనాలని తేలిపోయింది. అయితే ఈ ఖండన అన్నది తాత్కాలికం మాత్రమే.
మళ్లీ ఇలాంటి ప్రచారాలు రాక మానవు అన్నది కాదనలేని వాస్తవం. సోషల్ మీడియా యుగంలో రకరకరకాల ప్రచారాలకు ఆస్కారం ఉంది. అందులో పెళ్లి కాని నటీమణుల విషయంలో ఇలాంటి ప్రచారాలు పీక్స్ లో జరుగుతుంటాయి. వీటికి శాశ్వత పరిస్కారంగా నెటి జనులు రెండు మార్గాలు త్రిష ముందు ఉన్నాయంటున్నారు. ఒకటి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవడం లేదా పెళ్లి చేసుకోనని అధికారికంగా ప్రకటన చేయడం అంటూ త్రిషకు సలహాలు జారీ చేస్తున్నారు. అంత వరకూ త్రిషపై నెట్టింట ఈ రకమైన ప్రచారాలకు పుల్ స్టాప్ పడటం కష్టమనే అంటున్నారు. త్రిష వయసు ఇప్పటికే 42 ఏళ్లు అన్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే నటిగా బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న `విశ్వంభర`లో నటిస్తోంది. దీంతో పాటు కొన్ని తమిళ సినిమాలు కూడా కమిట్ అయింది.

















