ఓ సినిమాకు స్టార్ కాస్టింగ్ ప్రధాన ఆకర్షణగా భావిస్తుంటారు. వాళ్లే సినిమాకు బజ్‌ని క్రియేట్ చేస్తారని, తద్వారా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించి మూవీకున్న బజ్‌ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళతారని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. లిరికల్ సాంగ్సే అసలు గేమ్ ఛేంజర్స్‌గా మారి సినిమాకు బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళుతున్నాయి.
కరోనాకు ముందు విడుదలైన `అల వైకుంఠపురములో` మూవీ సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్‌ల కొద్దీ వ్యూస్‌ని రాబట్టి సినిమాపై హైప్‌ని క్రియేట్ చేయడం తెలిసిందే. అప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్‌లో కొత్త ఒరవడి మొదలైంది.ఈ మూవీ సాంగ్స్ బుట్టబొమ్మ, రాములో రాములా..` వన్ బిలియన్ వ్యూస్‌ని అధిగమించి ఈ స్థాయిలో వ్యూస్‌ని అధిగమించిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా రికార్డు సృష్టించింది. ఆ తరువాత నుంచి అన్ని సినిమాలు ఇదే పంథాని అనుసరిస్తున్నారు.
అది ఇప్పుడు తారా స్థాయికి చేరి సినిమాకున్న బజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే స్థాయికి చేరుకుంది. దీంతో స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు లిరికల్ సాంగ్సే అసలు గేమ్ ఛేంజర్స్‌గా మారుతున్నాయి. టీజర్ కంటే ఎక్కువ హైప్‌ని క్రియేట్ చేస్తూ 100 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించి సినిమాకు మంచి బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి భారీ స్థాయిలో పబ్లిసిటీ క్రియేట్ అవుతూ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది.
రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న `పెద్ది` మూవీలోని `చికిరి చికిరి` సాంగ్ నెట్టింట సంచలనాలు సృష్టిస్తోంది. ఆస్కార్ విన్నర్ రెహమాన్ స్వరాలు అందించిన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలో చరణ్ మెస్మరైజింగ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ తళుకులు, రెహమాన్ సంగీతం ప్రధాన హైలైట్స్‌గా నిలిచి టాప్‌లో నిలబెట్టాయి.
నెలరోజుల్లోనే ఈ పాట తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 150 మిలియన్‌లకు మించి వ్యూస్‌ని రాబట్టి `పెద్ది`ని టాక్ ఆఫ్ ది ఇండియాగా మార్చింది. సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. ఇక ఇదే తరహాలో చిరు `మీసాల పిల్ల` కూడా నెట్టింట ట్రెండ్ అవుతూ `మన శంకర వరప్రసాద్`పై హైప్ క్రియేట్ చేస్తోంది. పవన్‌కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా `ఉస్తాద్ భగత్‌సింగ్`లోని `దేఖ్‌లేంగె సాలా` అంటూ సాగే లిరికల్ వీడియోని రీసెంట్‌గా విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే 29.19 మిలియన్‌ల వ్యూస్‌ని రాబట్టి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమా గేమ్ ఛేంజర్‌గా మారింది. `సంక్రాంతికి వస్తున్నాం`లో `గోదారి గట్టుపైన రామచిలకవే` సాంగ్ ఈ సినిమాకు ఏ స్థాయి హైప్‌ని తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. ఒక్క పాటతో సినిమా జాతకమే మారిపోతుందనడానికి ఈ సినిమానే ఊదరహరణ.


















