రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్న ఈయన.. అప్పటినుంచి వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ మంచి విజయం సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రాలు కథపరంగా డిజాస్టర్ గా నిలిచినా కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతీ దర్శకత్వంలో తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు ప్రభాస్.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ తో పాటు కొంత రీ షూటింగ్ కారణంగా సినిమాను వచ్చే ఏడాది అనగా జనవరి 9వ తేదీకి విడుదలను వస్తుందా వేశారు. ఇటు విడుదల తేదీకి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో అటు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం. అందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం యూరప్ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడే రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు కూడా..
ఇలాంటి సమయంలో మారుతి ప్రభాస్ తో చేస్తున్న సాంగ్ షూటింగ్ నుంచి ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.. ఇందులో వైట్ కలర్ లుంగీ కట్టుకొని, రెడ్ కలర్ టీషర్టులో.. తలకు పాగా.. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఉన్న ప్రభాస్ ఫోటో లీక్ అవ్వగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పటికే మారుతి షూస్ వరకు ఉన్న ఫోటోని లీక్ చేశాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉన్న పిక్ లీక్ అయిపోయింది. పైగా ప్రభాస్ కి సంబంధించిన ఈ లుక్ బాగుండడంతో అటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కానీ మారుతి ఇలా పిక్స్ లీక్ అవ్వకుండా కాస్త జాగ్రత్త పడుంటే బాగుండేది
సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు.. ఆ సినిమా నుంచి ఇలాంటి దృశ్యాలు లీకైతే సినిమాపై బజ్ తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో చిత్ర బృందం ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి . కానీ సాంగ్ షూటింగ్ నుంచి ఇలాంటి ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు కూడా అప్పుడే ఆ పాత్రలో నటీనటులు ఎలా ఉంటారు అంటూ ఊహించేసుకుంటారు. పైగా ఇలా లీక్ అయిన వీడియోలు ఫోటోల వల్ల థియేటర్లలో చూసేటప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండదు. కాబట్టి.. ఇప్పటికైనా చిత్ర బృందం అలర్ట్ అయ్యి.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని 2026 జనవరి 9 వరకు సినిమాను కాపాడుకోవాలని నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.