పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై మొదటికంటే ఇప్పుడు మరింత ఆసక్తి పెరుగుతోంది కానీ అంతకంటే ఎక్కువగా డౌట్స్ ఎక్కువయ్యాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ ఇప్పటికే చాలా ఆలస్యం చూస్తోంది. మొదట మే 16న విడుదల చేస్తామనగా ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదని టాక్. ఫ్యాన్స్ మాత్రం టీజర్ అయినా ఇచ్చి కాసింత బజ్ క్రియేట్ చేయమని అంటున్నారు. కానీ మేకర్స్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్.
ఇటీవల ప్రభాస్ ఇటలీలో ఉండటం, హైదరాబాదుకు రాకపోవడం, డబ్బింగ్ పనులు ఆగిపోవడం అన్నీ కలిపి టీజర్ రిలీజ్ కూడా జూన్‌కి వెళ్ళిపోతుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. మేకర్స్ మౌనం వల్ల సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు విస్తరిస్తున్నాయి. మరీ ఈ ఏడాదిలోనే సినిమా వస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, రాజాసాబ్ సినిమాకు సంబంధించి కొన్ని సానుకూల పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో కొత్తగా రొమాన్స్ + హారర్ కలయికను చూపించబోతుంది. అలాగే, సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి ఆసక్తికరమైన తారాగణం ఉండటం పాజిటివ్ బజ్‌కి కారణం. కానీ ఈ బజ్ నిలుపుకోవాలంటే చక్కటి ప్రమోషన్లు కావాలి.
ఇకనైనా మేకర్స్ సైలెన్స్ బ్రేక్ చేసి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిలీజ్ డేట్ మారిందా? టీజర్ ఎప్పుడు వస్తుంది? షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబిస్తేనే అభిమానుల మధ్య ఉన్న అసంతృప్తిని తగ్గించగలరు. లేకపోతే, రూమర్లు, డౌట్స్ మరింత పెరుగుతూనే ఉంటాయి. రాజాసాబ్ టీం నుంచి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.