సెప్టెంబర్ to డిసెంబర్ సినిమాల రిలీజ్ లో చూస్తే రాబోతున్న స్టార్ సినిమాలన్నీ మేజర్ గా థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే వస్తున్నాయి. అందులో సెప్టెంబర్ 25న వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి డిసెంబర్ లో రాబోతున్న రాజా సాబ్, అఖండ 2 వరకు ఉన్నాయి. ఒక్కో సినిమా ఒక్కో జోనర్ తో సినీ ప్రియులను అలరించడానికి వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ రిలీజ్ లు చూస్తే థమన్ మ్యూజిక్ తో వీరంగం గ్యారెంటీ అనిపిస్తుంది.
సెప్టెంబర్ 25 దసరా బరిలో దిగుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. ఈ సినిమాకు థమన్ డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేశాడు. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ కొత్తగా మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పవర్ స్టోర్మ్ సాంగ్ తోనే సినిమాలో థమన్ ఎలా వాయిస్తున్నాడో అర్ధమైంది. ఇక నెక్స్ట్ థమన్ మ్యూజిక్ తో వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ తెలుసు కదా.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ఇది. నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 17న వస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ హెల్ప్ కాబోతుంది. ఇప్పటికె సినిమా నుంచి రిలీజైన మల్లిక గంద సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
ఇక నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కోసం థమన్ మరోసారి తన బిజిఎం తో అదరగొట్టబోతున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు థమన్ ఇచ్చే బిజిఎం వేరే రేంజ్ లో ఉంటుంది. ఈ క్రమంలో రాజా సాబ్ మ్యూజిక్ విషయంలో థమన్ ది బెస్ట్ ఇచ్చేలా ఉన్నాడు. రాజా సాబ్ టీజర్ తోనే శాంపిల్ చూపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు థమన్. రాజా సాబ్ మ్యూజిక్ విషయంలో తప్పకుండా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుందని అంటున్నారు.
నెక్స్ట్ బాలయ్య అఖండ 2 సినిమాకు థమన్ మ్యూజిక్ సంథింగ్ క్రేజీగా ఉండబోతుంది. అఖండ కు ఎలాగైతే థమన్ బిజిఎం స్పీకర్లు పగిలిపోయాయో ఈసారి దానికి మించి సౌండ్ అదిరిపోయేలా చేస్తున్నాడట. తప్పకుండా అఖండ 2 మ్యూజిక్ విషయంలో థమన్ తగ్గడని అంటున్నారు.
ఇలా రాబోతున్న ఈ సినిమాలతో థమన్ మ్యూజిక్ పరంగా సినిమాలకు కావాల్సిన బజ్ ఇస్తున్నాడు. ఈ సినిమాలన్నీ కథ పరంగా కూడా మంచి హైప్ తో వస్తున్నాయి. మరి సినిమాలకు థమన్ ఏమేరకు న్యాయం చేస్తాడన్నది చూడాలి.