బంగ్లాదేశ్‌కు భారత్ ఓ సారి విముక్తి వచ్చేలా చేసింది. పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడింది. అలా ఏర్పడటానికి భారత్ .. పాకిస్తాన్ పై ప్రత్యేకంగా యుద్ధం చేసి ఓడించాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్ కు మరోసారి అలాంటి అవసరం వచ్చింది. బంగ్లాదేశ్ ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఓ అశాంతి నాయకుడి చేతుల్లో ఉంది. ఆయన లేటు వయసులో ప్రజల్ని రెచ్చగొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని తరిమేసి కుర్చీ ఎక్కి కూర్చున్నాడు. ఏ నోబెల్ శాంతి బహుమతి చేయని తప్పుల్ని చేస్తున్నాడు.
ప్రభుత్వాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. ఇప్పుడు ప్రజా పార్టీలను నిషేధిస్తున్నాడు. షేక్ హసీనాకు చెందిన రాజకీయ పార్టీని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అసలు ప్రజా ప్రభుత్వమే లేనప్పుడు ఇలా ఓ రాజకీయ పార్టీలను నిషేధించే అధికారం ఉంటుందా.. అవకాశమే ఉండదు. ఉగ్రవాద చట్టాలని చెప్పి.. మరొకటని చెప్పి పార్టీలను నిషేధిస్తున్నాడు. షేక్ హసీనాకు ఆదరణ తగ్గలేదు. ఆమె పార్టీ బలంగా ఉంది. అందుకే నిషేధం విధించారు.
విద్యార్ఱుల్ని రెచ్చగొట్టి బంగ్లాదేశీ నేతగా మారిన యూనస్ ఇప్పుడుతన పదవిని కాపాడుకునేందుకు…. చైనాకు సరెండర్ అయ్యారు. చైనా సాయంతో తమ దేశంలో అణచివేతలు కొనసాగించి.. పదవిని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం హసీనాను చంపేందుకు కూడా ఆయన వెనుకాడటం లేదు. అందుకే కేసుల మీద కేసులు పెట్టి.. హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేందుకే కాదు.. పాకిస్తాన్ కు మద్దతుగా యుద్ధం చేస్తాం లాంటి ప్రకటనలు కూడా చేశారు. భారత్ పై తెర వెనుక ఏమైనా కుట్రలు చేశారేమో ఇంకా బయటకు రాలేదు.
యూనస్ లాంటి వాళ్లను ఉపేక్షిస్తే భారత్ కు నష్టం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో మళ్లీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంలో భారత్ చొరవ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే సరిహద్దుల్లో మరో సమస్య తెచ్చిపెట్టుకున్నట్లవుతుంది.యూనస్ పదవి చేపట్టినప్పటి నుండి ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని,ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడిందని ఆర్మీ వర్గాలు తెలియజేశాయి.తద్వారా,సమీప భవిష్యత్తులో దేశం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవచ్చని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో, దేశంలో స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత ఎక్కువగా ఆర్మీదేనని అధికారి వర్గాలు భావిస్తున్నాయి.ఈ సమావేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, యూనస్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాదు, సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బంగ్లాదేశ్‌లో సైన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు గళమెత్తాయి.ఈక్రమంలో యూనస్ పాలనపై తిరుగుబాటు ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.దీనికి ప్రతిస్పందనగా, సైన్యం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని ఢాకాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడగా, వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.ఇక షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి సైన్యం సహకరిస్తుందనే ఆరోపణలు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి.అయితే, బంగ్లా ఆర్మీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.గతేడాది ఆగస్టులో, రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన సమయంలో, షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.అప్పటి నుండి ఆమె భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలను మహమ్మద్ యూనస్ నిర్వహిస్తున్నారు.