ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే తాటిపై ఎదిగిన లీడర్లు సీఎంలుగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం.. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం. ఈ ఇద్దరు నాయకులు కలిసి తెలుగు రాష్ట్రాన్ని చాలా ఏళ్లపాటు పాలించారు. ఇందులో చంద్రబాబు కాస్త సీనియర్ నాయకుడు అనుకోండి రేవంత్ రెడ్డి కాస్త జూనియర్ నాయకుడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రానికి ఈ ఇద్దరు గురు శిష్యులు..కాదు కాదు రాజకీయాల్లో సీనియర్ జూనియర్స్ ముఖ్యమంత్రు లుగా ఉన్నారు. అంతేకాదు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు.. ముఖ్యంగా చంద్రబాబును ఎక్కువగా రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. చంద్రబాబు నాయుడు పి4 అనే పథకాన్ని తీసుకువచ్చి 20 లక్షల మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పారు.
అంతేకాకుండా మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. దాన్ని పి4 కు అనుసంధానం చేసి ధనవంతుల్ని మార్గదర్శకులని, ధనం లేని వారిని బంగారు కుటుంబాల కింద చేసి, మార్గదర్శకులతో డబ్బులు ఇప్పించి కోటీశ్వరులు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేద ప్రజల యొక్క కుటుంబాలను సాకపోవడానికి, వారి పిల్లల చదువులకు, వైద్యానికి బాసటగా ఉంటామని తెలియజేశారు. చంద్రబాబు ఏ విధంగా చెప్పి ప్రజలను నమ్మించారు ప్రస్తుతం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులు చేస్తానని అంటున్నారు..
ఈ విధంగా చంద్రబాబు ఏ విధమైనటువంటి మాట మాట్లాడారో, రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగానే చెబుతున్నారు.. ఈ విధంగా వారి ఎన్నికల ముందు మహిళలకు 2500 ఇస్తానన్నది పక్కకు వెళ్ళి పోయింది.. ప్రస్తుతం మహిళలను కోటీశ్వరులను చేస్తానని ఈ పథకాన్ని పక్కదారి పట్టించారు. ఈ విధంగా ఏదైనా పథకం నెరవేర్చలేకపోతే అది కేసీఆర్ వైఫల్యం అని రేవంత్ రెడ్డి అంటూ వస్తున్నారు. ఇక ఏపీలో జగన్ వైఫల్యం వల్లే పథకాలు అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఈ విధంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకే విధమైన ఆలోచనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.