తెలంగాణ సంప్రదాయ పండుగల్లో బోనాలు అత్యంత ముఖ్యమైనవి. ఏటా ఆషాడ మాసంలో అమ్మవారిని కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గత ప్రభుత్వం (బీఆర్ఎస్) ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఒక్క రోజు, రెండు రోజులు కాదు ఈ అమ్మవారిని కొలిచే ఉత్సవాలు నెల మొత్తం వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ లో ఈ వేడుకలు మరింత వైభవంగా కొనసాగుతాయి. అయితే అక్కడ కొలువైన ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కొలుస్తారు.
అందుకే నెల మొత్తం సంబురాలు కొనసాగుతాయి. తొలిబోనం గోల్కొండ కోటలోని జగదాంబికా ఎల్లమ్మకు సమర్పించిన భక్తులు బోనాలు వేడుకలను మొదలు పెడతారు. 7వ బోనం లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనంతో వేడుకలు ముగుస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం కాబట్టి ఆ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు వేడుకలు ఉంటాయి.
అమ్మవారి బోనాలు ఈ సారి ఎక్కువ సెలువులను తీసుకువచ్చింది. నగరంలోని సాఫ్ట్ వేర్ కొలువులు చేసేవారు. బడి పిల్లలు చిన్నా చితకా వ్యాపారాలు చేసే వారు కూడా సెలవులను చూసి మురిసిపోతున్నారు. ఎప్పుడూ ఆదివారం కోసం ఎదురు చూసే స్కూల్ పిల్లలకు ఈ సారి అటూ ఇటుగా ఐదు రోజులు సెలువులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఇందులో ఒక రోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. అందులో మరో రోజు కొన్ని విద్యా సంస్థలు, ఒకటి సాధారణ సెలువు, చివరిది బంద్ ఇలా ఎక్కువ రోజులు కలిసి వస్తుంది. ఈ సెలవులను కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వీకెండ్ మంచి ట్రిప్ వేసేందుకు వీలుగా ఉంటుంది.
హైదరాబాద్ లోని ఐటీ కార్పొరేటర్ కంపెనీల సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ప్రతీ శని, ఆదివారం సెలువు (వీకెండ్ హాలీడేస్) ఉంటుంది. అయితే వీరి పిల్లలు ఎక్కువగా ఉండే విద్యాసంస్థలు వారి వీకెండ్ కు తగ్గట్లు ప్రతీ శని, ఆదివారాలు సెలవులు ఇస్తుంటాయి. ఇలా చూస్తే శుక్రవారం మాత్రమే వారికి స్కూల్ ఉంటుంది. రెండో రోజు జూలై 19 (శనివారం) రోజున వీకెండ్ హాలిడే. ఇక ఆదివారం నేషనల్ హాలిడే.. ఇదే రోజు నగర వ్యాప్తంగా అందరూ బోనాల పండుగ చేసుకుంటారు. ఈ రోజు సెలవే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు.
తర్వాతి రోజు సోమవారం కూడా సమీప బంధువులతో ఇళ్లల్లో వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో మద్యం, మాంసంతో విందులు ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, లేదంటే ఆదివారం సెలవు మిస్ అయ్యిందని తెలంగాణ ప్రభుత్వం సోమవారం జూలై 21న బోనాల సెలవు ప్రకటించింది.
ఇక సోమవారం తర్వాత వచ్చే మంగళవారం జూలై 22 కార్యాలయాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు యధావిధిగా కొనసాగుతాయి. స్కూల్స్ కూడా మొదలవుతాయి. ఇక్కడో విషయం ఉంది. ఆ ఒక్క రోజు విద్యార్థులు సెలవు పెట్టాలనుకుంటే.. బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉంది. దీన్ని వారు పాటిస్తే జూలై 23 వరకు కంటిన్యూగా విద్యార్థులకు మాత్రం అదనంగా ఒక రోజు కలిసి వస్తుంది. ఏది ఏమైనా ఈ సారి బోనాలు ఎక్కువ సెలవులను తీసుకువచ్చాయి.
లావాదేవీలకు కేంద్రాలైన బ్యాంకులతో వ్యాపారుల నుంచి సాధారణ పౌరుల వరకు రోజూ పని ఉంటుంది. ఒక్క రోజు బ్యాంకు మూసి ఉంటే వ్యాపారులకు లక్షలాది రూపాయల ట్రాన్జాక్షన్ ఆగిపోతుంది. కాబట్టి బ్యాంకులు చాలా ఇంపార్టెంట్ అయితే ఈ వారంలో గడిచిన రోజులకు పక్కన పెడితే గురు, శుక్ర, శనివారాలు బ్యాంకులు పని చేస్తాయి.
ఆదివారం నేషనల్ హాలిడే కాబట్టి పని చేయవు. ఇక సోమవారం తెలంగాణ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. కాబట్టి ఆ రోజు కూడా పని చేయవు. తిరిగి మంగళవారం తెరుచుకుంటాయి. బ్యాంకు లావాదేవీలకు చేసుకునేవారు అలర్ట్ గా ఉండాలి.