Telangana,ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ .
భర్త .. దుబాయ్ లో ఉద్యోగం .
అమ్మాయి. ఇంటర్ సెకండ్ ఇయర్.
అబ్బాయి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ .
పిల్లలిద్దరినీ హాస్టల్ నుంచి తీసుకొని .. కారులో చర్ల పల్లి రైల్వే స్టేషన్ కు వెళ్ళింది .
అప్పుడు సమయం రాత్రి 11.30 .
చర్ల పల్లి రైల్వే స్టేషన్ లో కారు పార్క్ చేసి ట్రాక్ పక్కనే నడుచుకొంటూ ఘట్కేసర్ వైపు.
తల్లీ .. పిల్లలిద్దరూ… గంటన్నర పాటు నడిచారు .
పిల్లలిద్దర్నీ ఒడిసి పట్టుకొని రాత్రి ఒంటి గంటకు … ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడింది .
ముగ్గురూ మరణించారు .
ఇదీ … పోలీస్ లు ఇచ్చిన సమాచారం ప్రకారం మీడియా లో వచ్చిన కథనం .
పిల్లలు ఇంటర్ చదువుతున్నారు .
“మమ్మీ . ఇదేంటి ఇంత రాత్రి పూట రైల్వే ట్రాక్ పక్కన నడవడమేంటి?” అని అడిగివుంటారు .
ఆమె బలవంతంగా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని గూడ్స్ రైలు కింద పడే అవకాశం లేదు .
ఎందుకంటే ఇంటర్ చదివే అబ్బాయి .. అలాగే అమ్మాయి .. ఇద్దరి శారీరిక దారుఢ్యం ముందు తల్లి బలం నిలవదు .
పైగా గంటన్నర ట్రాక్ వెంబటే నడిచారు .
అంటే ఆ గంటన్నర ఆమె వారితో మాట్లాడింది .
మూకుమ్మడి ఆత్మ హత్యకు వారిని ఒప్పించింది .
ఏమి కారణం అయ్యివుంటుంది ?
ఆర్థిక కష్టాలు ?
అవకాశం లేదు .
భార్య భర్తల మధ్య వివాదం ?
అయితే .. పిలల్లు తాము కూడా చనిపోవాలని ఎందుకు అనుకొంటారు ?
మమ్మీ కి డాడీ కి సయోధ్య కుదర్చాలి అని కదా అనుకొంటారు ?
ఆమె ఫోన్ లో ఒక మెసేజ్ ఉందట . ఎవరో వ్యక్తి .. “సారీ మేడం ఇంకో సారి తప్పు చేయను” అని మెసేజ్ పెట్టారట .
అంటే ఏంటి ?
ఎలా అర్థం చేసుకోవాలి ?
ఎవడో చేసిన తప్పుకు తాను ఆత్మ హత్య చేసుకోవాలా ?
అందునా తనతోపాటు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ?
ఇంటర్ వయసు పిలల్లు లైఫ్ గురించి ఎన్నో కలలు కంటుంటారు ?
వారిని గంటన్నర లో ఒప్పించగలిగింది . “దుబాయ్ లో ఉన్న డాడీ కి ఫోన్ చేద్దాము” అని వారు అడిగి ఉండరా ?
అంతలా ఎలా ఒప్పించగలిగింది ?
ఆమెకు వచ్చిన కష్టం ఏంటి ?
కారణం ఏమై ఉంటుంది ?
అది ఎంత బలంగా ఉంటుంది ?
చావాలి అనుకొంటే కారణాలు లక్ష .
బతకడానికి కారణం ఒక్కటే .. మనం మనుషులు కనుక .
జంతువులు ఆత్మ హత్య చేసుకోవు.
మనిషికి ఒకే జీవితం – సైన్స్ .
ఆత్మ హత్య చేసుకొంటే దెయ్యాలుగా మారి అష్టకష్టాలు – మతం .
ఈ కోణం నుంచి చూసినా ఆత్మ హత్య మహా పాపం .. మహా నేరం .
తన కడుపున పుట్టిన పాపానికి ఎదిగిన పిల్లల జీవితం కూడా నలిపేసింది తల్లి .
లోకం లో ఇంత నిరాశ నిస్పృహలు ఎందుకు ప్రబలుతున్నాయి ?
బతుకంటే పోరాటం ..
కష్టం తరువాత సుఖం .. చీకటి తరువాత వెలుగు .
ఈ జీవన సూత్రాన్ని ఎందుకు మరచి పోతున్నారు ?
ఇంకో ఘటన .
వారిద్దరిదీ ప్రేమ వివాహం .
తమ వృత్తుల్లో పేరుగాంచారు .
కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు .
అక్కడి దాక అది వారి పర్సనల్ లైఫ్ .
తన భార్య వివాహేతర సంభంధం కలిగి ఉండేదని భర్త ఏకంగా ఒక పుస్తకం రాసారు. అందులో తాను కూడా మరో స్త్రీ పట్ల ఎలా ఆకర్షితుడు అయ్యిందీ రాసారు .
వారికి ఇద్దరు అబ్బాయిలు .
ఇద్దరూ అమెరికా లో .. ముప్పై కి కాస్త అటుఇటు వయస్సు .
మన మమ్మీ గురించి డాడీ ఇలా బుక్ రాసారు అని తెలుకొన్నాక వారి ఫీలింగ్ ఎలా ఉంటుంది ?
వివాహం కుటుంబం .. ఈ వ్యవస్థలు తగలబడి పోనీ .
కనీసం మనిషి పై మనిషికి నమ్మకం కుదురుతుందా ?
వారు ప్రొఫషనల్ లైఫ్ లో నలుగురితో కలిసి పని చేయగలరా ?
అమెరికా సమాజం వేరు .. అక్కడి సామాజిక ప్రమాణాలు వేరు .. నిజమే .. కానీ అమ్మ నాన్న కదా? . వారు పుట్టి పెరిగింది ఇక్కడే కదా ?
ఇంకో ప్రశ్న .
అమెరికా లో ఇన్నాళ్ళు ప్రొఫషనల్ లైఫ్ కు అత్యధిక ప్రాధాన్యం .
ఒక విధంగా చెప్పాలి అంటే .. బతకడం కోసం ఉద్యోగం కాదు .. ఉద్యోగం కోసం బతకడం .
ఇండియా లో కూడా ఆ సంస్కృతి వచ్చేసింది అనుకోండి . కాదనను .
ప్రాణం కంటే ఎక్కువగా భావించిన ఉద్యోగాలు ఇప్పుడు పోతున్నాయి .
2030 సంవత్సరానికి నిరుద్యోగం తారా స్థాయిలో ఉంటుందని అంచనా .
ప్రధానంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు .
ఎక్కువగా ప్రభావితమయ్యేది యువతీ యువకులు
బాధల్లో ఉన్న వ్యక్తికి కుటుంబమే అండ .. మానసిక ఊరట .
కుటుంబాలే లేని వ్యక్తులకు ?
ఉద్యోగం పోయాక ఇంటి కొచ్చి ఎవరి ఒడిలో తల పెట్టి ఏడవాలి ?
ఎవరి ద్వారా స్వాంతన పొందాలి ?
ఎందుకు బతకాలి ? ఎవరి కోసం బతకాలి అని వారికి అనిపించిందా ?
ఈ పోస్ట్ లో చివరి అంశం .
1450 నుంచి 1530 వరకు పోర్చుగీసు రియల్ .
1530 నుంచి 1640 వరకు స్పానిష్ డాలర్ .
1640 నుంచి 1720 వరకు డచ్ గిల్డర్ .
1720 నుంచి 1815 వరకు ఫ్రెంచ్ ఫ్రాంక్ .
1815 నుంచి 1920 వరకు బ్రిటిష్ పౌండ్ .
1920 నుంచి నేటి దాక అమెరికన్ డాలర్ .
ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయ ఆధిపత్యం మహా అంటే 110 సంవత్సరాలే . డాలర్ ఆధిపత్యం ఇప్పటికే 105 సంవత్సరాలు . అంటే ఇక మిగిలింది అయిదేళ్ళేనా ??
ఇప్పుడు అమెరికా అప్పులు 38.5 ట్రిలియన్ డాలర్స్ .
డాలర్ అంతర్జాతీయ నమ్మకాన్ని కోల్పోతోంది .
అందుకే 2000 లో 73 % గ్లోబల్ రిజర్వు … డాలర్స్ రూపం లో ఉంటే అది ఇప్పుడు 58 శాతానికి పడిపోయింది .
చైనా వాడు తెలివయినోడు .
అంతకు మించి స్విట్జర్లాండ్ వాళ్ళు . డబ్బు తో వారు వ్యాపారం చేసినట్టు ఎవరూ చేయలేరు .
డాలర్ ని నమ్ముకొంటే లాభం లేదని వాళ్ళు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నారు . అందుకే గోల్డ్ రేట్స్ ఆలా పెరుగుతున్నాయి .
పిలల్లు , వారి పిలల్లు అమెరికా లో సెటిల్ అయితే జీవితం హ్యాపీ అని లక్షల మంది భారతీయుల నమ్మకం .
డాలర్ దెబ్బతింటే ..ఉద్యోగాలు పోయి, ఆర్థిక కష్టాలు అలుముకొంటే … కుటుంబ వ్యవస్థ పై నమ్మకం తగ్గుతున్న భావి తరాలకు మానసిక అండ ఎవరు ?
సమాజానికి పునాది … వివాహ – కుటుంబ వ్యవస్థ .
అది దెబ్బ తింటే ?
Telangana













