రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని క్రియేట్ చేసిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసు తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి చేసిన నేపథ్యంలో.. కాళ్ల పారాణి ఆరకుండానే భర్తను ప్రియుడితో కలిసి మర్డర్ చేసిన ఐశ్వర్య అలియాస్ సహస్త్ర ఉదంతం తెలిసిందే. ఈ హత్యకేసును విచారిస్తున్న పోలీసులు సరికొత్త అంశాల్ని గుర్తించారు. సహస్త్రను విపరీతంగా ప్రేమిస్తున్నట్లుగా చెప్పే తిరుమలరావు.. ఆమెకు తెలీకుండా ఆమెను జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసిన వైనాన్ని విచారణ అధికారులు గుర్తించారు.
సహస్త్ర బయటకు వెళ్లిన క్షణం నుంచి ఆమె ఎక్కడకు వెళుతోంది? ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తుందన్న విషయంతో పాటు.. ఆమెకు సంబంధించిన అన్ని అంశాల్ని తెలుసుకునేందుకు వీలుగా ఆమెను ట్రాక్ చేస్తుండేవాడు. ఆమెకు మోపెడ్ ను గిఫ్టుగా ఇచ్చిన అతను.. ప్రియురాలికి తెలీకుండానే ఆ వాహనానికి ట్రాకర్ ను అమర్చిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయం సహస్త్రకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తాను చేసిందంతా సహస్త్ర మీద ప్రేమతోనే అని చెప్పిన అతను.. ఆమెను అనుమానించేవాడన్న విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. కానీ.. ఇదే తిరుమలరావు కోసం.. పెళ్లి చేసుకున్న రెండు వారాల్లోపే భర్తను దారుణంగా మట్టుబెట్టిన వైనం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ అయిన రెండు రోజులకే తనకీ పెళ్లి ఇష్టం లేదని తిరుమల రావుకు చెప్పటంతో.. బెంగళూరులోని తన బంధువుల ఇంటికి సహస్త్రను పంపాడు. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఆమె మిస్ అయిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో పెళ్లికొడుకు తేజేశ్వర్ కు తెలియజేయటం.. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దొంగ మాటలు చెప్పి.. అతడ్ని పెళ్లి చేసుకోవటం.. రెండు వారాలకే తన ప్రియుడు తిరుమలరావుతో కలిసి దుర్మార్గమైన ప్లానింగ్ చేయటం.. ప్రైవేటు సర్వే పేరుతో కారులో తీసుకెళుతూ తేజేశ్వర్ ను హత్య చేయటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సహస్త్రను విపరీతంగా ప్రేమిస్తున్నట్లు చెప్పే తిరుమలరావు.. ఆమెను నిత్యం నిఘా నీడలో ఉంచటం చూస్తే.. ఆమెను అతను అనుమానిస్తున్న వైనం అర్థమవుతుంది. అలాంటోడ్ని గుడ్డిగా ప్రేమించటమే కాదు.. కట్టుకున్న భర్తను సైతం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.