టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో రూపొందుతున్న మిరాయ్ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. శ్రియ శరణ్, జయరామ్, జగపతిబాబు, రాజేంద్ర నాథ్, పవన్ చోప్రా, తాంజా కెల్లర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన మిరాయ్.. వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటికే మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. మూవీ క్యాస్టింగ్ అంతా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. మేకర్సేమో.. వరుసగా ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై వేరే లెవల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాను చూడాల్సిందే అన్న విధంగా బజ్ సృష్టిస్తున్నారు.
తాజాగా సినిమాకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ మూడో పార్ట్ ను మేకర్స్ షేర్ చేశారు. ట్రైన్ సీక్వెన్స్ ను వివరిస్తూ బీటీఎస్ వీడియో విడుదల చేశారు. సినిమాలో పెద్ద ఛాలెంజింగ్ సీక్వెన్స్ అని తెలిపారు. కథను మలుపు తిప్పే సన్నివేశం అని కూడా పేర్కొన్నారు. తేజ రిస్క్ చేసి ఇందులో నటించారని వెల్లడించారు.
వీడియో చూశాక.. మేకర్స్ చెప్పింది నూటికి నూరు శాతం నిజంలానే కనిపిస్తోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నూంగ్ కొరియోగ్రఫీ చేయగా.. ప్రతి విజువల్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ట్రైన్ పై షూటింగ్ చేసేందుకు టీమ్ అంతా చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు ఎంతో శ్రమించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
అదే సమయంలో తేజ సజ్జా అయితే ఆ సీక్వెన్స్ లో జీవించినట్లు కనిపిస్తున్నారు. రిస్క్ తో కూడిన సన్నివేశాల్లో కూడా ధైర్యంగా నటించారు. సినిమా కోసం ఏదైనా చేస్తా అన్నట్లు యాక్ట్ చేశారు. ఓవరాల్ గా బిహైండ్ ద సీన్స్ వీడియో చూశాక.. తేజ మామూలుగా కష్టపడలేదని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ట్రైన్ సీక్వెన్స్ ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.