*అనంతపురం జిల్లా SP జగదీశ్ ప్రెస్ మీట్
తన్మయి హత్య కేసు చేదించాం… నరేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసాంపోస్ట్ మార్టం లో తలకు దెబ్బ తగలడం వల్ల చనిపోయింది అని తెలిసిందినరేష్ కి తన్మయి కి గత మూడు నెలల నుండి పరిచయం అయిందిగత నెల క్రితం నుండి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందిపెళ్లి చేసుకుందామని చెప్పి తీసుకెళ్లి రాయితో కొట్టి చంపేశాడుఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇలాంటి వారికి చట్ట ప్రకారం శిక్ష వేసేందుకు ప్రయత్నం చేస్తాంఇలాంటి నేరాల్లో పాల్పడిన వారికి ప్రభుత్వ పథకాలు రద్దుకు సిఫార్సు, వారి ఆస్తులు కూడా అటాచ్ చేస్తాంరేప్ అనేది ఏమి లేదు…పెట్రోల్ పోసి తగలబెట్టడం లాంటివి జరగలేదుమొదట బాలు అనే వ్యక్తి మీద అనుమానం ఉందని ఫిర్యాదు ఇచ్చారుకేసులో నిర్లక్ష్యం ఉందని అనంతపురం వన్ టౌన్ సిఐ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని సస్పెండ్ చేసాం.తన్మయి హత్య కేసు నిందితుడు నరేష్ సంబంధించిన ఆస్తులు అటాచ్ , ప్రభుత్వ పథకాల రద్దుకు సిఫార్సు చేస్తున్నాం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోమన్నందుకే తన్మయిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు నరేష్ వెల్లడించాడు. నరేష్ ఇది వరకే మరో యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతపూర్ జిల్లా (Anantapur District) రామకృష్ణనగర్‌లోని తన్మయి ఇంటి సమీపంలో నిర్మిస్తున్న ఓ కొత్త ఇంటికి టైల్స్ వేసేందుకు నిందితుడు వెళ్లాడు. ఆ విధంగా నరేష్, తన్మయి మధ్య పరిచయం, సాన్నిహిత్యం పెరిగింది. విద్యార్థిని తన తండ్రి సెల్ నుంచి పలుమార్లు నరేష్‌కు ఫోన్ చేసి మాట్లాడేది. అంతేకాకుండా ఫోన్ పే, నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్లు పోలీస్ విచారణలో నిందితుడు వెల్లడించాడు.
ఇదిలా ఉండగా.. తన్మయికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ నరేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది విద్యార్థిని. అయితే తనకు ఇది వరకే పెళ్లి కావడంతో తన్మయిని అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు నరేష్. పథకం ప్రకారమే తన్మియిని పిలిపించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తరువాత తాను అనుకున్న ప్రకారం తన్మయిని బండరాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బీర్ బాటిల్‌ను నోట్లో పెట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.
* అనంతపురం పట్టణ వన్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర నాథ్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు
* బాలిక హత్య కేసులో నిర్లక్ష్య ధోరణి వివాదం