సినిమాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ తమన్నా లీడ్ రోల్ ఛాన్స్ లు అందుకుంటుంది అంటే ఆమె టాలెంట్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో ఒకప్పుడు స్టార్స్ తో నటించి సత్తా చాటిన తమన్నా కొన్నాళ్లు బాలీవుడ్ లో కూడా సందడి చేసింది. ఐత్ సౌత్ లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ వేరు. అందుకే ఇక్కడే సినిమాలు చేస్తూ వస్తుంది. సీనియర్ హీరోలతో జత కడుతూ అలరిస్తుంది మిల్కీ బ్యూటీ. ఐతే తమన్నా ఈమధ్యనే ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
అశోక్ తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కథ, కథనం, డైరెక్షన్ సూపర్ విజన్ అన్నీ తానై ఉన్నాడు సంపత్ నంది. ఈ సినిమా నిర్మాణంలో కూడా అతను భాగమని తెలిసిందే. ఉన్నంతలో ఓదెల 2 మీద మంచి బజ్ ఏర్పరచడమే కాకుండా అలాంటి సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ని మెప్పించేలా చేశారు. ఐతే తమన్నా ఈ సినిమాను చేయడం వల్ల ఆమె ప్లస్సే అయినట్టుగా చెప్పొచ్చు. ఓదెల 2 కమర్షియల్ గా కూడా ఓకే అనిపించేసింది. సో తమన్నాతో ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు అనే విధంగా ఓదెల 2 తో ప్రూవ్ అయ్యింది. ఇప్పటివరకు తమన్నా ఇలా సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా సినిమా అటెంప్ట్ చేయలేదు. ఈ తరహా కథలను ఒకప్పుడు అనుష్క చేసింది.. ఈమధ్య సమంత కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి మెప్పించింది. సో ఇప్పుడు తమన్నా కూడా డిఫరెంట్ కథలతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరించేలా ఉన్నారు.
ఎలాగు కంటెంట్ ఉన్న సినిమాలకు కాస్టింగ్ ఎవరన్నది చూడరు. అక్కడ కొత్త వాళ్లు ఉన్నా ఆడియన్స్ సినిమాను ఎంకరేజ్ చేస్తారు. అదే తమన్నా లాంటి హీరోయిన్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే తప్పకుండా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓదెల 2 వల్ల తమన్నాకి చాలా వరకు బెనిఫిటే జరిగింది. నెక్స్ట్ కూడా ఆమె ఇలాంటి కథలను చేసేందుకు డేర్ చేస్తుందని చెప్పొచ్చు. సో కమర్షియల్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు ఇక మీదట తమన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బెటర్ ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. ఇది తమన్నాకి మంచి లాభమే చేకూరేలా చేస్తుంది. ఓదెల 2 తర్వాత తమన్నా వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.