ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు నిత్యం హాట్ హాట్ గా కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలోఅనంతపురం జిల్లా, తాడిపత్రి రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నిత్యం జెసి వర్సెస్ పెద్దారెడ్డి అనే విధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి.. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి దివాకర్ రెడ్డి మరోసారి బయటకు వస్తూ తనదైన శైలిలోనే అందరికీ మాస్ వార్మింగులు ఇస్తున్నారు.
దివాకర్ రెడ్డి ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడతారనే సంగతి మనకు తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా తాడిపత్రిలో రాజకీయాలు సంచలనగా మారాయి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లడానికి అనుమతి లేకపోయినా ఆయన తాడిపత్రికి వెళ్లడంతో చేసి దివాకర్ రెడ్డి వరుస మీడియా సమావేశాలలో పాల్గొంటున్నారు. తాజాగా ఈయన మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… ఏమో రాబోయే రోజులలో మేము కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కుటుంబంతో మాకు మొదటి నుంచి కూడా చాలా మంచి అనుబంధాలే ఉన్నాయి. మీ అందరికన్నా ఆ కుటుంబంతో మాకే చాలా సాన్నిహిత్యం ఉంది. మేము ఇప్పుడు వాళ్ళం కాదు అంటూ మాట్లాడారు. ఎవరినైనా ఏదైనా అని ఉంటే క్షమించండి కేవలం నా బాధను మాత్రమే బయటకు చెబుతున్నాను అంటూ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
ఇలా ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి రావచ్చేమో అంటూ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈయన బహుశా అలాంటి ఆలోచనలో ఉన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది ఆయన కుమారుడు ఎమ్మెల్యే అలాగే ప్రభాకర్ రెడ్డి కూడా మున్సిపల్ చైర్మన్ ఇలా అధికారం మొత్తం వీరిది అయినప్పటికీ ఈయన వైసీపీలోకి రావచ్చేమో అంటూ మాట్లాడటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.