అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో రాజకీయాలు నిరంతరం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా టిడిపి, వైసిపి మధ్య ఎక్కువ ఉధృత పరిస్థితులు తాడిపత్రిలో కొనసాగుతూ ఉన్నాయి. వైసిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపి సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డి వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన ఫైర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను కాజేశారని ఆరోపణలు కూడా చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. అలాగే సోలార్ ఫ్యాక్టరీ కి రైతులకు ఇచ్చిన భూములను కూడా బలవంతంగా లాక్కున్నారని… అలాగే గతంలో అధికారం చూసి తనను కొడతానని అన్నాడని కూడా తెలిపారు జెసి.
అయితే ఇప్పుడు తాజాగా పెద్ద రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తూ.. నీ భూములో నా వాళ్ళు అడుగుపెట్టారు నీ భూమి యొక్క ఫెన్సింగ్ని కూడా పీకేసారు ఇప్పుడు చేతనైతే తనని వచ్చి కొట్టమంటూ పెద్ద రెడ్డి పైన ఫైర్ అయ్యారు జేసి ప్రభాకర్ రెడ్డి.. దేవుడు భూములను ఆక్రమంగా తీసుకున్నావు ఈరోజు నువ్వు తాడిపత్రి వదిలి ఏడాది అయింది ప్రజలు పండుగ చేసుకుంటున్నారంటూ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఎన్నో రోజులు అవుతూ ఉన్న తాడిపత్రిలో మాత్రం రాజకీయ హీటు తగ్గలేదు.
ఎన్నికల సమయంలో మొదలైన ఈ రాజకీయరగడ అప్పటినుంచి ఇప్పటికే కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీల మధ్య కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవ కనిపిస్తూ ఉన్నది. వైసిపి ఓటమి తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి మరింత చెలరేగిపోయారంటూ కూటమిలోని నేతలు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే జెసి మాత్రం పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ తన నియోజకవర్గంలోకి అసలు అడుగు పెట్టకుండా చేస్తూ ఉన్నారు. ఇటీవలే పెద్దరెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వడానికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది.. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ వైసీపీ నేతను రానివ్వనంటూ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు.