నారా ఫ్యామిలీ హీరో నారా రోహిత్ లేటెస్ట్ మూవీ సుందరకాండ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి ఎంటర్టైనర్ సినిమాగా ఇది సూపర్ అనిపించుకుంటుంది. నారా రోహిత్ నుంచి ఇలాంటి ఒక మంచి ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అవుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. నారా రోహిత్ ఈ సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచు. ఫ్యామిలీ అంతా చూసే సినిమాగా సుందరకాండ ఎంగేజ్ చేస్తుంది.
సుందరకాండతో నారా రోహిత్ కెరీర్ లో ఒక మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈమధ్యనే భైరవం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఆ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుందరకాండ అంటూ సోలో సినిమాతో సత్తా చాటాడు.
బాణం సినిమాతో తెరంగేట్రం..
నారా రోహిత్ కెరీర్ లో చూస్తే.. 2009 లో బాణం సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఐతే అతనికి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన తొలి సినిమా సోలో. ఆ సినిమా నుంచి డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వచ్చాడు నారా రోహిత్. ఈ క్రమంలోనే ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర సినిమాలు వచ్చాయి.
ఐతే ఈ ప్రయత్నాలు నారా రోహిత్ కి సెపరేట్ మార్క్ సెట్ చేసాయి. ఐతే సినిమా ఫలితం ఏదైనా తన అటెంప్ట్ తాను చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్. భైరవంలో తన పాత్రకు న్యాయం చేసిన రోహిత్ ఫైనల్ గా సుందరకాండ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు.
సూపర్ కంబ్యాక్..
ఇదొక విధంగా నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. సినిమాల పరంగా ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న నారా రోహిత్ ప్రతినిధి 2 చేశాడు. ఐతే అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. భైరవం జస్ట్ ఓకే అనిపించింది. ఐతే సుందరకాండ మాత్రం అతనికి సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది. సోలో సినిమాలో ఎలా అయితే నారా రోహిత్ కి మంచి బూస్టింగ్ ఇచ్చిందో.. సుందరకాండ సినిమా అలా ఈ హిట్ తో సూపర్ జోష్ ఇచ్చింది.
సుందరకాండ సినిమా విషయానికి వస్తే.. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు శ్రీదేవి విజయ్ కుమార్, విరితి కలిసి నటించారు. ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను సూపర్ గా ఇంప్రెస్ చేసింది.
జోష్ నెక్స్ట్ రాబోతున్న సినిమాలు..
సినిమాలో కామెడీ మిగతా యాస్పెక్ట్స్ అన్నీ కూడా అదిరిపోయాయి అంటున్నారు. ఫ్యామిలీ అంతా కూడా చూసే సినిమాగా సుందరకాండ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతున్న మాట నిజమైంది. సుందరాకాండ లక్ ఎలా ఉంది అంటే.. సినిమాకు పాజిటివ్ రావడమే కాదు వినాయక చవితి రిలీజై సక్సెస్ అందుకుంది. అంతేకాదు పోటీగా ప్రస్తుతం ఎలాంటి సినిమా లేదు. తప్పకుండా ఈ సినిమాకు ఫ్యామిలీస్ ఫుట్ ఫాల్స్ పెరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది.
సుందరకాండ సక్సెస్ తో నారా రోహిత్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సక్సెస్ తో ఈ హీరో సక్సెస్ పంథాలోకి వెళ్తాడని చెప్పొచ్చు. కెరీర్ లో సరైన టైం లో సరైన హిట్ అందుకున్నాడు నారా రోహిత్. సుందరకాండతో కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి మరి ఇదే జోష్ నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.