టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ లెక్కే వేరు.. ఆయన మేకింగ్ అండ్ టేకింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. లెక్కల మాస్టర్.. వివిధ చిత్రాలతో తనదైన శైలిలో అలరించారు. పుష్ప సిరీస్ చిత్రాలతో అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఓ రేంజ్ లో మెప్పించారు.
అదే సమయంలో ఎంతో క్వాలిటీ డైరెక్టర్స్ ను టాలీవుడ్ కు అందించారనే చెప్పాలి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లను అందించడంలో సుకుమార్ ముందుంటారు. ఇప్పటికే ఆయన శిష్యుల్లో చాలా మంది దర్శకులుగా మారిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల, సూర్య ప్రతాప్, బుచ్చి బాబు.. అలా కాస్త పెద్ద లిస్టే ఉంది.
అటు భారీ సినిమాలు చేస్తూనే.. ఇటు తన ఎప్పుడూ శిష్యులను ప్రోత్సహిస్తున్నారు సుక్కూ. అంతే కాదు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో సానబెడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన విషయం బయటకు తెలియడంతో సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అంత మంచితనం, ఓపిక ఎవరికీ లేదేమోనని చెబుతున్నారు.
రీసెంట్ గా సుకుమార్ దుబాయ్ వెళ్లారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ అయిన స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం వెళ్లారని అంతా అనుకున్నారు. అక్కడ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయని అంచనా వేశారు. కానీ సుక్కూ.. వెళ్లింది ఆయన శిష్యుల కోసం. వారి ఇప్పటికే డెబ్యూస్ కోసం రాసుకున్న కథలో సెట్ చేయడానికి వెళ్లారట.
సుకుమార్ శిష్యుడైన వీర కోగటం.. ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. అదే సమయంలో మరో శిష్యురాలు మాధురి.. సుమంత్ ప్రభాస్ తో ఓ మూవీ చేయనున్నారు. అందుకే ఆయా స్టోరీల కోసం దుబాయ్ ట్రిప్ వేశారు. అంతే కాదు.. ఆ చిత్రాలను తన సుకుమార్ రైటింగ్స్ పై నిర్మించనున్నారు.
అలా సుకుమార్ తన శిష్యుల సినిమాల్ని లైనప్ చేయడంలో బిజీగా ఉన్నారని చెప్పాలి. అదే సమయంలో సుకుమార్ చేస్తున్నదాన్ని చూసి మిగతా టాప్ దర్శకుల శిష్యులు.. బయటకు ఏం చెప్పకపోయినా లోపల కుళ్లుకుంటారేమో. ఎందుకుంటే అటు సినిమాలు తీస్తూ.. నిర్మిస్తూ.. ఇటు శిష్యుల కోసం టైమ్ కేటాయించడం మామూలు విషయం కాదు. ఎంతో ఓపిక.. మంచితనం ఉంటేనే అది సాధ్యమవుతుంది.