‘స్త్రీ-2′ తో మరో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది శ్రద్దా కపూర్ . బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా 800 కోట్ల వసూళ్లతో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఎంతో మంది స్టార్ భామలకు సాధ్యం కానిది శ్రద్దా కపూర్ సాధించి చూపించింది. 100 కోట్ల బడ్జెట్ లో అద్భుతమైన సినిమా తీసి రికార్డు నెలకొల్పడం అమర్ కౌశీక్ కి మాత్ర మే సాధ్యమైందని ప్రూవ్ చేసాడు. ఈ సినిమా అనంతరం శ్రద్దా కపూర్ రేంజ్ రెట్టింపు అయింది. ఈ చిత్రం రిలీజ్ అయి ఆగస్టుతోనే ఏడాది పూర్తయింది.
కానీ ఇంత వరకూ శ్రద్దా కపూర్ అధికారికంగా ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. దీంతో కథల విషయంలో కపూర్ బ్యూటీ మరింత శ్రద్దగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. కమర్శియల్ చిత్రాలకు కూడా కమిట్ అవ్వడం లేదు. లక్ష్మణ్ ఉట్టేకర్ తో `విట్టా` సినిమాకు కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందులో క్లారిటీ లేదు. అలాగే బోనీ కపూర్ నిర్మాణ సంస్థలోనూ ఓ సినిమాకు చర్చలు జరుపు తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బోనీకపూర్ ఎలాగైనా శ్రద్దా కపూర్ ని ఒప్పిం చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారుట.
రెండు మూడు నెలలుగా బోనీ అదే పనిలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విష యంలో శ్రద్దా కపూర్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో కపూర్ బ్యూటీ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అమ్మడికి మంచి అవకాశాలే వస్తున్నాయి. కానీ శ్రద్దా కపూర్ అనాసక్తిగా ఉంది. హిందీ పరిశ్రమలో స్టార్ హీరోల ఆఫర్లను సైతం రిజెక్ట్ చేస్తుందన్నది మరో ప్రచారం.
స్త్రీ-2’ తో కపూర్ బ్యూటీ స్టార్ డమ్ రెట్టింపు అవ్వడంతో మళ్లీ అదే రేంజ్ హిట్ అందుకునే ప్లాన్ లో ఉన్నట్లుంది. మరి కొత్త ప్రాజెక్ట్ పై ఏడాది చివరికైనా క్లారిటీ ఇస్తుందా? ప్రెష్ గా 2026లో రివీల్ చేస్తుందా? అన్నది చూడాలి. `సాహో` చిత్రంలో అమ్మడు తెలుగు స్టార్ ప్రభాస్ సరసన ఆడిపాడిన సంగతి తెలి సిందే. ఆ సినిమా హిందీలో బాగానే ఉంది. కానీ టాలీవుడ్ లోనే వర్కౌట్ అవ్వలేదు.