ఆవేదనను ఆగ్రహంగా మార్చే సమయం… కలల సంస్థ (RDT) కోసం మన గొంతులు కలిపే సమయం…
ఒకప్పుడు ఈ నేలపైకి తొలిసారి అడుగుపెట్టినప్పుడు మహారాష్ట్రలో ఆయనపై రాళ్ల వర్షం కురిసింది. రెండోసారి మన అనంతపురానికి రాగానే “Go Back Ferrer” అనే అవమానపూర్వక నినాదాలు వినిపించాయి. అయినా సరే, అవమానాలన్నింటినీ తట్టుకుని, ద్వేషపు రాళ్లను సహనపు గోడలుగా మార్చుకుని, ఆ గోడలపై కరుణ, ప్రేమ, సేవ అనే ఇటుకలతో ఒక మహామనిషి ఈ నేలపై ఆశాకిరణంగా నిలిచారు.
ఈ రోజు ఆయన లక్షలాదిమందికి కేవలం ఆదర్శమే కాదు దేవుడే అయ్యారు.
ఎందుకు ఈ పోరాటం?
- ఆయన కలల సాకారమైన సేవాసంస్థ RDT ఈరోజు ఇబ్బందుల్లో ఉంది.
- ప్రభుత్వాల నిర్లక్ష్యం, కొంతమంది నాయకుల కబ్జా దురాశ, కొన్ని సోషల్ మీడియా వదంతులు ఇవన్నీ కలసి ఆ సంస్థను ముంచేయాలని పన్నిన పన్నాగాల్లా కనిపిస్తున్నాయి.
- విదేశాలనుండి వచ్చి మన పేదలకు వైద్యం, విద్య, ఆశ అందించిన సంస్థను మూసివేయడం అంటే పేదల ఊపిరినే ఆపడం.
మోసపెట్టే వదంతులకు మోసపోవద్దు
కొంతమంది సోషల్ మీడియా మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్లు “ఇదిగో అయిపోయింది ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజం కాదు. ఇది కేవలం ఉద్యమాన్ని బలహీనపరచే ప్రయత్నం మాత్రమే. మనం దానికి లోనుకాకూడదు.
మన ఉద్యమం నిజాయితీతో నిండినది, అది ఆగదు, అది గెలుస్తుంది.
నాయకులు మౌనం వహించకూడదు
అనంతపురం జిల్లాలో పేదలు ఎక్కువ, కానీ వారి నాయకులు సంపన్నులు. వారికి ఈ పేదల కోసం చెమట చిందించమని ఎవరూ అడగడం లేదు. వారి ప్రభావాన్ని, పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వాన్ని ఒప్పించండి అంతే.ప్రజలను మోసం చేసి కబ్జా చేసుకునే శక్తులు బలంగా ఉన్నాయి. కానీ మన ఐక్యత దానికంటే బలంగా ఉంటుంది. మన గొంతులు కలిసినప్పుడు ప్రభుత్వాలు కూడా వినక తప్పదు.
ఇది కేవలం RDT కోసం కాదు మన గౌరవం కోసంRDT కేవలం ఒక సంస్థ కాదు, అది పేదల ఆసుపత్రి, పాఠశాల, పేద పిల్లల కలల వెన్నుపూస. దానిని రక్షించడం అంటే మన గౌరవాన్ని రక్షించడం.మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జిల్లాకు వెలుగు ఇచ్చిన సేవా దీపాన్ని కాపాడుకునేందుకు,ఇప్పుడే గొంతు విప్పుదాం….We Want Justice, We Want RDT ✊ఈ పోరాటం పేదల ఊపిరికోసం, మన మనసుల గౌరవం కోసంమన గొంతులు కలపుదాం, మన Ferrer కలను కాపాడుదాం!అలసట లేదు, వెనుకడుగు లేదు.మనమందరం కలసి నిలబడితే RDT కేవలం బ్రతకడమే కాదు, మరింత ప్రకాశిస్తుంది.