శీతల పానీయాల ప్రకటనలు, గుట్కా- పాన్ మసాలా ప్రకటనల్లో నటించడం షారూఖ్ లాంటి పెద్ద హీరోకి తగదని చాలా మంది విరుచుకుపడతారు. వేల కోట్ల నికర ఆస్తులున్న ఖాన్ ప్రజలకు హాని కలిగించే ఇలాంటి ప్రకటనల్లో నటించడం ద్వారా సంపాదించాలంటారా? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు.
అయితే దీనికి వ్యతిరేకంగా తాజా ఇంటర్వ్యూలో షారూఖ్ తార్కిక వాదన ఆశ్చర్యపరిచింది. ఒకవేళ కోలాలు తాగితే ప్రజారోగ్యానికి హానికరం అని భావిస్తే , మీరే వాటిని నిషేధించాలి. కానీ ప్రభుత్వాలకు ఆదాయం కావాలి.. అందువల్ల వీటిని నిషేధించరు. ఒకవేళ సిగరెట్లు తాగితే చిన్నారుల ఆరోగ్యానికి హానికరం అని భావిస్తే, వెంటనే వాటిని ప్రభుత్వం నిషేధించాలని కూడా ఖాన్ అన్నారు.
శీతల పానీయాలు ప్రమాదకరమని మీరు అనుకుంటే, అవి మన ప్రజలను విషపూరితం చేస్తుంటే, భారతదేశంలో వాటిని తయారు చేయనివ్వవద్దు. ఇవన్నీ మీకు ఆదాయాన్నిస్తుంటే వాటిని ఆపడం లేదు. ఇవి ప్రభుత్వానికి ఆదాయం. అయినా నేను ప్రభుత్వం కాదు.. నా ఆదాయాన్ని ఆపవద్దు. నేను ఒక నటుడిని. నేను ఒక పని చేసి దాని నుండి ఆదాయం పొందాలి. నేను చాలా స్పష్ఠంగా ఉన్నాను. నా ఉద్దేశం ప్రకారం…మనం తప్పు అని అనుకున్న ప్రతిదీ ఆపేద్దామని కూడా ఖాన్ అన్నాడు.
షారూఖ్ ఖాన్ తదుపరి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న `కింగ్` చిత్రంలో సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్ కీలక నటులు. షూటింగ్ ప్రస్తుతం పోలాండ్ లో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఆయన ఒక ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స కోసం అమెరికాకు వెళ్లాల్సి రావడంతో షూటింగ్ కూడా కాస్త ఆలస్యమైంది. ఇటీవల జవాన్ లో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న ఖాన్ ఒక మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.