ఓజీ సినిమా చూసిన తర్వాత శ్రీయా రెడ్డి గురించి మాట్లాడకుండా ఉండలేరు. నిడివి తక్కువ ఉన్న రోల్ అయినా ఆమె తన మార్క్ చూపించారు. ఓజీ సినిమాలో శ్రీయా రెడ్డిని కావాలని తీసుకున్నాడు సుజిత్. ఎందుకంటే నెగిటివ్ రోల్ చేసే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. మేల్ విలన్ దొరుకుతారు కానీ లేడీ విలన్ అంటే కాస్త ఆలోచిస్తారు. కానీ కెరీర్ మొదట్లోనే శ్రీయా రెడ్డి ఆ స్టెప్ తీసుకున్నారు. సౌత్ లో లేడీ విలన్ అనగానే అందరికీ నరసిం హ సినిమాలో రమ్యకృష్ణ గుర్తొస్తారు. ఐతే ప్రస్తుతం శ్రీయా రెడ్డి కూడా అంత ఇంపాక్ట్ చూపించారు.
సలార్ లో కూడా ఆమె చేసిన పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే శ్రీయా రెడ్డి దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా కేవలం సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఆమె అందుకుంటుంది. అందుకే ఆమె వేళ్లతో లెక్క పెట్టే సినిమాలే చేసింది. ఐతే సలార్ 1, ఓజీ సినిమాల్లో మళ్లీ ఆయన నెగిటివ్ షేడ్స్ ఆడియన్స్ ని మెప్పించాయి. ఇలాంటి రోల్స్ కి ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. ఈమధ్య వరలక్ష్మి శరత్ కుమార్ కూడా లేడీ విలన్ గా చేసినా శ్రీయా రెడ్డి ఎందుకో స్పెషల్ గా అనిపిస్తారు.
ఐతే ఓజీ చూశాక ఆమెకు ఇలాంటి ఆఫర్స్ ఎన్నో వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆమె అన్నిటికీ ఓకే చెప్పదట. తను నెగిటివ్ రోల్ లేదా సినిమాలో నటించాలంటే పాత్రతో పాటు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు మాత్రమే కావాలని అంటుంది. స్టార్ సినిమాలు మాత్రమే చేస్తానంటుంది కాబట్టే ఆమెకు సరైన అవకాశాలు లేవని చెప్పొచ్చు. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు తన పాత్ర వరకు డిమాడ్ ఓకే కానీ అది స్టార్ సినిమానే అయ్యుండాలని చెప్పడం కెరీర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఓజీ తర్వాత మళ్లీ శ్రీయా రెడ్డి తిరిగి ఫాం లోకి వచ్చేలా ఉన్నా వచ్చిన సినిమాల్లో కథ ఆమె పాత్ర చూస్తే ఓకే కానీ స్టార్ ఉన్నాడా లేదా అన్నది పట్టించుకుంటే మరో ఛాన్స్ రావడం కష్టమే. మరి శ్రీయా రెడ్డి ఈ ఒక్క కండీషన్ ని పక్కన పెడితే మాత్రం ఆమె కోసం కొత్త పాత్రలు రాసి మరీ అవకాశం ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు.
ఎలాగు సలార్ 2 లో ఆమె పాత్ర ఉంటుంది. దానికి తోడు మరికొన్ని అవకాశాలు వస్తే శ్రీయా రెడ్డి కెరీర్ ఫాం లోకి వస్తుంది. శ్రీయా రెడ్డి కోలీవుడ్ హీరో విశాల్ కి వదిన అనే విషయం తెలిసిందే. విశాల్ పొగరు సినిమాలో ఆమె విలన్ గా నటించి మెప్పించారు.