శ్రీదేవి విజయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా ఫ్లాపైనా శ్రీదేవి అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2009 వరకు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు శ్రీదేవి.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని హీరోయిన్ గా నటించడం మానేసి జడ్జిగా పలు షోల్లో కనిపించారు. అయితే పెళ్లి చేసుకుని తల్లిగా మారాక కూడా శ్రీదేవి అందం ఏ మాత్రం తగ్గలేదు. ఆమె అందం చూసి అభిమానులు మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేయాలని డిమాండ్ చేయడంతో వారి కోరిక మేరకే శ్రీదేవి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
37 ఏళ్ల వయసులో శ్రీదేవి ఇప్పుడు హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. నారా రోహిత్ హీరోగా కొత్త డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వస్తోన్న సుందరకాండ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. ఆగస్ట్ 27న సుందరకాండ ప్రేక్షకుల ముందుకు రానుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ చిట్ చాట్ ను నిర్వహించగా అందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో ఓ సీన్ కోసం శ్రీదేవి కొన్నాళ్లపాటూ ఫుడ్ తీసుకోలేదని, కేవలం వాటర్ మాత్రమే తాగారని, ఆమె డెడికేషన్ ను చూసి చాలా ముచ్చటేసిందని డైరెక్టర్ చెప్పారు. సినిమాలో శ్రీదేవి ఓ సీన్ కోసం స్కూల్ యూనిఫాంలో కనిపించాల్సి ఉండగా, ఆ సీన్ లో ఆమె ఎలా కనిపిస్తుందోనని ముందు భయపడ్డానని, ఆ సీన్ కోసం లుక్ టెస్ట్ చేసినప్పటికీ భయం మాత్రం అలానే ఉందని, కానీ షూట్ కు వెళ్లినప్పుడు నిజంగానే యూనిఫాం లో ఆమె చాలా బాగా కనిపించారని, అదేంటి అదెలా సాధ్యమని ఆమెని అడిగితే అసలు కారణం చెప్పారని డైరెక్టర్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత చిట్ చాట్ లో ఉన్న అందరూ శ్రీదేవిని తెగ ప్రశంసించగా, ఈ సినిమా సక్సెస్ పై శ్రీదేవి చాలానే ఆశలు పెట్టుకున్నారు.