ఒకే ఒక్క పేరు.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను మరిగిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని చోట్లా ఈ నామధేయమే పదే పదే వినిపిస్తోంది. అంతగా తన ప్రతిభ, డ్యాన్సులతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ పేరు శ్రీలీల. ఒక తెలుగమ్మాయి ఈ స్థాయిలో దూసుకెళ్లడం అన్నది మునుపెన్నడూ లేదు. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్న ఏకైక తెలుగు బ్యూటీగా గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సరసన రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఆషిఖి ఫ్రాంఛైజీ సినిమా కాదు కానీ, ఇంచుమించు అదే షేడ్స్ తో కొత్త కథలో నటిస్తోందని కథనాలొచ్చాయి. శ్రీలీలకు ఇది బాలీవుడ్ లో గేమ్ ఛేంజర్ గా మారుతుందని కూడా అంచనా వేస్తున్నారు. మొదటి సినిమా సెట్స్ లో ఉండగానే, బాలీవుడ్ లో మరో సినిమాకి సంతకం చేసిందని కథనాలొచ్చాయి. మాస్ జాతర, పరాశక్తి, లెనిన్ అనే మూడు చిత్రాల్లోను నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా ఫోటోషూట్లు, మ్యాగజైన్ కవర్ షూట్లతోను శ్రీలీల దూసుకెళుతోంది. తాజాగా ఓపెన్ మ్యాగజైన్ శ్రీలీల ముఖ చిత్రంతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోటోషూట్ లో శ్రీలీల స్ట్రైకింగ్ ఫోజులతో కట్టి పడేసింది. సింపుల్ ఫ్రాక్ లో ఈ బ్యూటీ కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ నుంచి యూనిక్ ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారుతోంది.