ధమాకాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తున్న అమ్మడు ప్రతి సినిమాతో తనను అభిమానిస్తున్న ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే వస్తుంది. హీరోయిన్ గా నటించడం అందరు చేస్తారు కానీ హీరోలతో ఈక్వల్ గా డ్యాన్స్ చేసే కథానాయికలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో శ్రీలీల పేరు బాగా వినిపిస్తుంది.
పెద్దగా అవకాశాలు అందుకోని శ్రీలీల నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తుంది. ప్రస్తుతం అమ్మడు మాస్ మహారాజ్ రవితేజతో మాస్ జాతార సినిమా చేస్తుంది. ఈ సినిమాతో మరోసారి ధమాకాని మించిన హిట్ అందుకోవాలని చూస్తుంది అమ్మడు.
ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా అక్కడ యువ హీరో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది అమ్మడు. ఆ సినిమా టీజర్ తోనే బీ టౌన్ ఆడియన్స్ కి దగ్గరైంది శ్రీలీల. ఆషికి ఫ్రాంచైజీలో భాగంగా ఆషికి 3 గా వస్తున్న ఈ సినిమా మీద శ్రీలీల కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఐతే ఈ సినిమాలతో శ్రీలీల తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల నెక్స్ట్ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. తెలుగు, హిందీలోనే కాదు తమిళ్ లో కూడా శ్రీలీల శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా మీద కూడా ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. తప్పకుండా రాబోతున్న ఈ సినిమాలు శ్రీలీలకు మంచి క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి. టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ గా శ్రీలీల ఇప్పటికే టాప్ లీగ్ లో ఉండగా ఇక నెక్స్ట్ సినిమాలు కూడా ఆమె కి హిట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే తప్పకుండా మళ్లీ శ్రీలీల తిరిగి ఫాంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు ఫ్లాపులు పడితే వెనక్కి తగ్గే టైపు తను కాదని ఇప్పటికే ప్రూవ్ చేసిన శ్రీలీల రాబోతున్న సినిమాలకు ఆమెకు అంత మంచిగా కలిసి రావాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.