టాలీవుడ్ లో టాప్- 5 బెస్ట్ డ్యాన్సర్ల గురించి ప్రస్థావిస్తే, అందులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్, శ్రీలీల, సాయిపల్లవి పేర్లు ప్రముఖంగా జాబితాలో ఉంటాయి. అయితే జగపతిబాబు `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల తల్లి గారైన డాక్టర్ స్వర్ణలత కుమార్తెకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం రివీల్ చేసారు.
శ్రీలీలను డ్యాన్స్ శిక్షణలో చేర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్ఫూర్తి నింపారో వెల్లడించారు. షోలో ఎన్టీఆర్ కూచిపూడి నేర్చుకుంటున్నప్పటి ఒక అందమైన స్టిల్ ని షేర్ చేయగా, ఆ ఫోటో వెనక స్టోరీని స్వర్ణలత వివరించారు. నాకు అమ్మాయి పుడితే డ్యాన్స్ నేర్పించాలని స్ఫూర్తి నింపిన క్షణానికి సంబంధించిన ఫోటో ఇది! అని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ని కలిసారా? అని ప్రశ్నించగా, 1997లో అమెరికా లాస్ ఏంజెల్స్- తానా సభల్లో ఒకసారి ఎన్టీఆర్ ని కలిసి మాట్లాడిన విషయాన్ని స్వర్ణలత గుర్తు చేసుకున్నారు. తాను అనుకున్నట్టే శ్రీలీలకు డ్యాన్సులు నేర్పించానని తెలిపారు.
హీరోయిన్ గా దూసుకెళుతున్నావ్.. చాలా మంది అవకాశాల్ని లాగేసుకుంటున్నావు కదా! అని షో హోస్ట్ జగపతిబాబు శ్రీలీలను ఆటపట్టించారు. ఈ షో ఆద్యంతం శ్రీలీల, ఆమె తల్లిగారైన స్వర్ణలత ఎన్నో ఆసక్తికర విషయాలను మాట్లాడారు. జీ5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. నాగార్జున మొదటి అతిథిగా ప్రారంభమైన ఈ షోని జగపతిబాబు విజయవంతంగా నడిపిస్తున్నారు.
శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్. మాస్ జాతర, పరాశక్తి లాంటి చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తదుపరి పవన్ కల్యాణ్ సరసన `ఉస్తాద్ భగత్ సింగ్`లోను ఆడిపాడుతోంది. అలాగే బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలోను శ్రీలీల నటిస్తోంది. యంగ్ హీరో కార్తీక్ తో తెలుగు బ్యూటీ డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి.