ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పాత వీడియోలు, ఇంటర్వ్యూలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజగా టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి ఎప్పుడూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె గతంలో చాలా సార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచింది. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పాత వీడియోలు, ఇంటర్వ్యూలు బయట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై నటి శ్రీ రెడ్డి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ వీడియోలో నటి శ్రీ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది.
” జీవన్ రెడ్డి ఒక ఫ్రాడ్. నన్ను వేధించాడు. తన వెనుక చాలా మంది ఉన్నారు. అమ్మాయిలను ఎప్పుడూ పార్క్ హయత్ హోటల్ కు రావాలని ఇన్ వైట్ చేసాడు. వెళ్లి కలిశాను. నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పాడు. సినిమాల్లో బ్లాక్ మనీ పెడతాం. టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలంతా మేం చెప్పింది చేయాల్సి ఉంటుంది. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే” అని శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.