బాలీవుడ్ సీరియల్స్ లో టాలెంట్ చూపించి అక్కడ నుంచి సిల్వర్ స్క్రీన్ ప్రమోట్ అయ్యింది మృణాల్ ఠాకూర్. హిందీలో సినిమాలు చేస్తూ ఒక మోస్తారు కెరీర్ కొనసాగిస్తున్న అమ్మడికి తెలుగు నుంచి సీతారామం ఆఫర్ రావడం అది ఆమె చేయడం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం అంతా అలా జరిగింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ సీతామహాలక్ష్మి పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్ హిట్ పడటంతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న చేసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇక థర్డ్ మూవీగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేసింది మృణాల్. ఆ ఒక్క సినిమా అమ్మడికి కాస్త షాక్ ఇచ్చింది. ప్రెజెంట్ అడివి శేష్ తో డెకాయిట్ మూవీ చేస్తుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాతో పాటు హిందీలో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. రీసెంట్ గా అజయ్ దేవగన్ తో మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా సన్ ఆఫ్ సర్ధార్ 2. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజైంది. సినిమాకు ఆశించిన రేంజ్ లో పాజిటివ్ టాక్ రాలేదు. ఐతే సన్ ఆఫ్ సర్ధార్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆఫ్టర్ రిలీజ్ మృణాల్ సోషల్ మీడియా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ చాట్ లో భాగంగా మృణాల్ ఒక వ్యక్తి మీ సినిమాకు వచ్చిన రివ్యూస్ చూసి సినిమా వెళ్దామనుకున్న వాడినే ఆగిపోయా అన్న కామెంట్ కనబడింది.
దానికి మృణాల్ ఆన్సర్ ఇస్తూ సినిమాను రివ్యూస్ మిస్ లీడ్ చేస్తాయని అన్నది. సినిమా ఎలా ఉంది అన్నది ఆడియన్స్ రివ్యూస్ చదివి కాదు చూసి డిసైడ్ చేయాలని అన్నది మృణాల్ ఠాకూర్. సినిమా సూపర్ హిట్ అయితే రివ్యూస్ కూడా సినిమాను బాగానే ఎంకరేజ్ చేస్తారని అంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ సినిమా మీద రివ్యూస్ ఎఫెక్ట్ పడిందని అంటారు. ఈమధ్య కొన్ని సినిమాలు అసలు రివ్యూస్ పట్టించుకోకుండా హిట్ అయినవి ఉన్నాయి.. కేవలం మౌత్ టాక్ తో సూపర్ హిట్ అవుతున్న ప్రాజెక్ట్ లు ఉన్నాయి. సో సినిమా రిజల్ట్ కాస్త తేడా ఉండగానే రివ్యూస్ మిస్ లీడ్ చేస్తున్నాయి. నెగిటివ్ రివ్యూస్ వల్లే సినిమాలు ఆడట్లేదని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్ధార్ 2 సినిమా చాలా పర్సనల్ గా తీసుకున్నట్టు ఉంది. అందుకే ఆ సినిమా నెగిటివ్ రివ్యూస్ పై ఆమె రుస రుసలాడుతున్నారు.