బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన స్టైలిష్ లుక్ తో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. తరచూ అందరిలో స్పెషల్ గా ఉండాలి అనుకునే సోనమ్ కపూర్ మరొక్కసారి తన స్టైల్ ఐకానిక్ ఎలాంటిదో కర్వాచౌత్ రోజు నిరూపించుకుంది.. బాలీవుడ్ లో ఫ్యాషన్ ని ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే నటిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కర్వాచౌత్ రోజు ఒక స్టైలిష్ బనారసీ శారీలో మెరిసింది.. రెడ్ కలర్ బనారసీ శారీలో ఉన్న సోనమ్ కపూర్ అందాలు ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. కర్వాచౌత్ రోజు క్లాసిక్, మోడ్రన్ రెండు కలగలిపి ఉన్న శారీని సోనమ్ కపూర్ ధరించింది..
కర్వాచౌత్ రోజు సోనమ్ కపూర్ బనారసీ చీరను ఎంచుకోవడంతో చాలామంది ఆమెకి సంస్కృతి సాంప్రదాయాలపై, ఇండియన్ వస్త్రాలపై ఎలాంటి గౌరవం ఉందో తెలుసుకోవచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు.. సోనమ్ కపూర్ కట్టుకున్న ఈ బనారసీ శారీలో జరీవర్క్ తో పాటు అనేక రంగులు కలగలిపి ఉండడంతో ఈ చీర అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే కర్వాచౌత్ కి ఈ చీర మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే సోనమ్ కపూర్ సాంప్రదాయమైనటువంటి బనారసీ శారీని ఎంచుకున్నప్పటికీ ఈ చీరను ఎప్పటిలాగా కామన్ గా కట్టుకోకుండా కాస్త డిఫరెంట్ స్టైల్లో మోడరన్ స్టైల్ లో కట్టుకోవడంతో మరింత అందంగా కనిపిస్తోంది.
సేమ్ ఒక యువరాణి మాదిరిగా సోనమ్ కపూర్ చాలా హుందాగా కనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన చాలామంది ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.అయితే సోనమ్ కపూర్ ధరించిన ఈ మోడ్రన్ బెనారసీ డ్రెస్ ను రియా కపూర్ తన దుస్తుల బ్రాండ్ నుంచి ప్రత్యేకంగా పంపించినట్లు సోనం కపూర్ వెల్లడించింది. ముఖ్యంగా ఫెస్టివల్ లో భాగంగా లాంచ్ చేసిన కొత్త డిజైనర్ దుస్తులను సోనమ్ కపూర్ కోసం రియా కపూర్ పంపించడంతో ఆ దుస్తులను ఈమె ధరించి.. ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ రియా కపూర్ కి ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ స్టైలిష్ చీర మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసంతన చెవులకు చెవు పోగులు, చేతులకు చమ్కీ బ్యాంగిల్స్ తో స్టైల్ చేయడంతో ఇవి చీరకి మరింత అందాన్ని జత చేశాయి. స్టైలిష్ మేకప్ తో నేచురల్ గా కనిపించడంతో పాటు శారీ కి సెట్ అయ్యేలా హెయిర్ ను స్టైల్ కూడా చేసుకుంది.. అలా మొత్తంగా పండగ లుక్ ని ఫుల్ ఫిల్ చేసేసింది సోనమ్ కపూర్. ఆమె నిర్భయమైన ఫ్యాషన్ ఎంపికలు ఆమె ఆత్మ విశ్వాసాన్ని నిరూపిస్తాయి.
సోనమ్ కపూర్ సహజమైన గ్లామర్ కి ఇలాంటి మోడ్రన్ ఫ్యాషన్ ఎంపికలు ఆమెని ఇండస్ట్రీలో మరింత గొప్పగా నిలబెడతాయని,సాంప్రదాయ భారతీయ దుస్తులను మోడ్రన్ గా ఎలా ధరించవచ్చో సోనమ్ కపూర్ ఎప్పటికప్పుడు నిరూపిస్తుంది అంటూ చాలామంది నెటిజన్స్ సోనమ్ కపూర్ ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు సోనమ్ కపూర్ ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది ఆమె లుక్ కి ఫిదా అయిపోయామని,అందర్నీ మత్తులో ముంచేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

















