పంజాబీ మూవీ ‘శుభం కలుగుగాక’తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. ఈ అమ్మడు తెలుగులోనూ వెంకటేష్ హీరోగా నటించిన బాబు బంగారం సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ద్వారా పరిచయం ఉంది. ఆ సినిమా తర్వాత సోనమ్ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్‌కే ఈ అమ్మడు పరిమితం అయింది. పంజాబీ, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా సౌత్‌లోనూ ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ అమ్మడు ఆకట్టుకునే విధంగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సోనమ్ బజ్వా అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే అని మరోసారి నిరూపితం అయ్యింది.
2012 ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొనడం ద్వారా ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. పంజాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వెంటనే తమిళ చిత్రంలోనూ నటించే అవకాశం దక్కింది. అయితే తమిళ సినిమాతో హిట్ దక్కక పోవడంతో అక్కడ మరిన్ని సినిమాలు చేయలేక పోయింది. అర్దాబ్ ముతియారన్ చిత్రంలోని ఈ అమ్మడి నటనకు గాను ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. పంజాబ్ నుంచి దక్కిన ఆ అవార్డ్ కారణంగా మరింతగా ఈమె బిజీ అయింది. తెలుగులో ఈమె ఆటాడుకుందం రా అనే సినిమాలోనూ నటించింది. కానీ కనీసం ఆ సినిమాలో ఈమె ఉన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ హిందీ, పంజాబీలో వరుస సినిమాలు చేస్తున్న ఈమె మరింత బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.
మూడు పదుల వయసు దాటిన తర్వాత సాధారణంగా హీరోయిన్స్ జోరు తగ్గుతుంది అంటారు. కానీ సోనమ్ బజ్వా ప్రస్తుత వయసు వికీపీడియా అనుసారం 36 ఏళ్లు, అయినప్పటికీ అమ్మడు చాలా బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ఈ ఏడాదిలోనే ఈమె నటించిన నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో హిందీ సినిమాలు సైతం ఉండటం విశేషం. కేవలం హీరోయిన్‌గా నటించాలి అనుకోకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఈ అమ్మడు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందాల ఆరబోత విషయంలోనూ ఈమె వెనక్కి తగ్గదు. అందుకే గ్లామర్ పాత్రలు దక్కించుకుంటూ ఇప్పటికీ ఇండస్ట్రీలో తాను ఉన్నాను అంటూ ఉనికి చాటుకుంటుంది. ఇలా చేస్తే తప్పకుండా ముందు ముందు కూడా మంచి ఆఫర్లు వస్తాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలతో మతి పోగొడుతోంది. నెటిజన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయి. థైస్ అందాలను చూపించడం ద్వారా ఆకట్టుకుంది. టైట్ డ్రెస్‌లో తన అందాన్ని చూపించడంతో పాటు, హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం వల్ల కూడా ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులోనూ ఇంత అందంగా ఉందేంట్రా బాబోయ్ అనిపించే విధంగా సోనమ్ బజ్వా అందంగా ఉంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో ముందు ముందు మరిన్ని సినిమా ఆఫర్లు ఈమె దక్కించుకుంటుందా అనేది చూడాలి. సౌత్‌లో మరోసారి ఈ అమ్మడు తన అదృష్టం పరీక్షించుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తుంది. మరి అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.


















