తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మల్లో శోభితా ధూళిపాళ్ల కూడా ఒకరన్న విషయం తెలిసిందే. తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ దక్కించుకుంది. టీనేజ్ లో మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన శోభితకు.. మిస్ ఇండియా కిరీటం త్రుటిలో మిస్ అయింది.
ఆ తర్వాత మిస్ ఎర్త్ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటిన శోభిత.. రామన్ రాఘవ్ 2.0 అనే హిందీ చిత్రంతో నటిగా మారిన సంగతి విదితమే. అనంతరం చెఫ్, కళా కంది వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసిన అమ్మడు.. యంగ్ హీరో అడవి శేష్ మూవీ గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా హిట్ అయినా.. టాలెంట్ తో ఆకట్టుకున్నా అంతగా తెలుగులో అవకాశాలు రాలేదు. కాస్త గ్యాప్ తర్వాత మేజర్ లో నటించిన శోభిత.. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక రీసెంట్ గా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన ఆమె.. కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తో వర్క్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మద్రాస్, కబాలి, సార్పట్టపరంపరై, తంగలాన్ లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన పా.రంజిత్.. వెట్టువమ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా శోభిత నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే అది నిజమని ఇప్పుడు తెలుస్తోంది. పవర్ ఫుల్ రోల్ లో శోభిత కనిపించనున్నట్లు సమాచారం. దీంతో సరైన పాత్ర.. అక్కినేని కోడలికి దక్కినట్లే. యాక్టింగ్ పరంగా మంచి టాలెంట్ ఉన్న అమ్మడు.. వెట్టువమ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడం పక్కా అనే చెప్పాలి. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అ సినిమాలో నటుడు దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తర్వాత వారి కాంబినేషన్ లో రానున్న మరో చిత్రంలో ఇప్పుడు శోభిత నటిస్తోంది. అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తూనే.. తన సొంత నిర్మాణ సంస్ఖపై నిర్మిస్తున్నారు కూడా. రెండేళ్ల క్రితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు.