టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయకున్నా శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే శోభిత అక్కినేని వారి ఇంటి కోడలు అనే విషయం తెల్సిందే. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత, చేసుకోక ముందు కూడా శోభితా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బాలీవుడ్‌లో ఈమెకు మంచి ఆఫర్లు లభించాయి, తద్వారా ఇప్పటికే బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న హీరోయిన్స్ జాబితాలో చేరింది. అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసిన కారణంగా అన్ని చోట్ల మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇతర భాషల్లో ఎక్కువగా శోభితా కనిపించడం తెలుగు వారికి గర్వించదగ్గ విషయం అనడంలో సందేహం లేదు. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా శోభిత వరుస ప్రాజెక్ట్‌లు కమిట్ అవుతూనే ఉంది.
తెలుగులో నాగ చైతన్యతో కలిసి శోభిత ఒక సినిమా చేయాలని అక్కినేని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అలాంటి చర్చలు ఏమీ లేవు. కానీ భవిష్యత్తులో చేయాలని అనుకుంటున్నట్లుగా మాత్రం వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని వారు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గత ఏడాది కాలంగా కొత్త సినిమాలతో రాని శోభిత వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక హిందీ సినిమా, ఒక వెబ్ సిరీస్ లో ఈమె నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత తన అందమైన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈమె తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
బ్లాక్ టాప్‌తో పాటు, బ్లూ జీన్స్ ధరించిన శోభిత అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. అందాల ఆరబోత చేసినప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా ఈమె కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మతి పోగొడుతున్న ఈ ఫోటోలు ఆమె అందం గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాయి అనడంలో సందేహం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందం విషయంలో, అన్ని విషయాల్లోనూ శోభిత ముందు ఉంటుంది. అందుకే బాలీవుడ్‌లో ఏకంగా ముంబై ముద్దుగుమ్మలకు పోటీగా నిలుస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఈమె అందంకు తగ్గట్లుగా టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో ఆఫర్‌లు రావడం లేదు అంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2013 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలవడం ద్వారా ఒక్కసారిగా ఈ ఫ్యాషన్ రంగం దృష్టిని ఆకర్షించింది. మిస్ ఎర్త్ 2013 లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించడం ద్వారా బాలీవుడ్‌లో పరిచయాలు ఏర్పడ్డాయి. అనురాగ్ కశ్యప్ యొక్క రామన్ రాఘవ్ 2.0 సినిమా ద్వారా నటిగా శోభితాకి ఇండస్ట్రీ ఎంట్రీ దక్కింది. అమెజాన్‌లో ఈమె చేసిన మేడ్ ఇన్ హెవన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆ తర్వాత తెలుగులో ఈమెకు ఎక్కువగా ఆఫర్లు రాలేదు. నాగ చైతన్య ను వివాహం చేసుకోవడంతో టాలీవుడ్‌లో ఇతర హీరోలకు జోడీగా ఈమె నటించే అవకాశాలు దక్కించుకోక పోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. కానీ చైతూకు జోడీగా మాత్రం ఈమె నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అది ఎప్పటికి సాధ్యం అవుతుందో చూడాలి.













