కెరీర్ ఆరంభంలో బోల్డ్ రోల్స్ చేసి పిచ్చెక్కించిన ఈ హీరోయిన్.. మెల్లగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం కోట్ల రూపాయల ఆస్తి ఉన్న హీరోకి భార్యగా మారింది. అంతేకాదు నిత్యం ట్రెండింగ్ లో ఉంటోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..మనం చెప్పుకోబోయే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. చైతూతో ప్రేమ, పెళ్లి మొదలుకొని ఆమె కెరీర్ ముచ్చట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
కెరీర్ పరంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఒకరు. ఆమె స్కిన్ టోన్, సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో కెరీర్ స్టార్టింగ్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో బోల్డ్ రోల్స్, లిప్ లాక్ సీన్స్ చేసి పిచ్చెక్కించింది.1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు జన్మించింది శోభిత. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. శోభితా ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్ లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది.
ముంబైలో డిగ్రీ చేసే సమయంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత.. మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచింది.2016లో ‘రామన్ రాఘవ్ 2.0’తో ఎట్టకేలకు శోభిత సినీ ప్రస్థానం ప్రారంభమైంది. 2019లో అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’తో శోభిత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1, 2’, ‘ది నైట్ మేనేజర్’ వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ పట్టేసింది.రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది శోభిత దూళిపాళ్ల. చైతూకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితకు ఫస్ట్ మ్యారేజ్. సమంతతో విడాకులు చేసుకున్న నాగ చైతన్య.. మళ్లీ ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో శోభితను పెళ్లి చేసుకున్నారు. ఈ రెండో పెళ్లి వ్యవహారంపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుకున్నారు.
అక్కినేని కోడలిగా వచ్చిన శోభితపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. సమంతతో విడాకుల విషయంలో శోభితను లాగుతూ కొందరు రెచ్చిపోయారు. అయితే రెండో పెళ్లి తర్వాత నాగ చైతన్య ఈ విషయమై స్పందిస్తూ ఇందులో శోభిత తప్పేలేదని క్లారిటీ ఇచ్చారు.