టీడీపీ నేతల్లో కొందరు హద్దలు మీరారు. నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడారు. మరికొందరు అంతర్గత చర్చల్లో చెప్పాల్సిన విషయాలను బహిరంగం చేశారు. తద్వారా ఏదో సాధించాలని అనుకున్నారు.ఇవన్నీ గత మూడు మాసాలుగా రచ్చలుగా మారాయి. పార్టీచుట్టూ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. వీటిని పట్టించుకున్నట్టే వ్యవహరించిన పార్టీ అధిష్టానం.. నివేదికలు తెప్పించుకుంది. ఇక చర్యలు ఉంటాయని భావించినప్పటికీ.. పార్టీ మౌనంగా వుంది.
నిజానికి మౌనానికి మించిన శిక్ష మరొకటి లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. టీడీపీ అధినేతగా చంద్రబాబు ఇలాంటివి అనేక చూశారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లో ఆయన అనేక ఆటుపోట్లు తిన్నారు. ఈ క్రమంలో ఇప్పుడున్న జూనియర్లను ఎలా దారిలో పెట్టాలో ఆయనకు కొట్టిన పిండి. అందుకే.. మౌనంగా ఉన్నారన్నది పార్టీలో జరుగుతున్నచర్చ. అదే బయట పడిపోయి.. చర్యలు-చర్చలు అంటూ చెబితే.. దీనికి అంతూ దరీ ఉండదు.
ఈ కీలక విషయం తెలిసిన చంద్రబాబు.. దారి తప్పుతున్న నాయకులను సైలెంట్‌గా పనిష్ చేస్తున్నార ని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు యాగీ చేసిన పలువురు నాయకులకు సంబంధించిన నివేదికలు రెడీ చేసారు. వారు ఏయే తప్పులు చేశారు? ఎక్కడెక్కడ ఎలా వ్యవహరిం చారన్న విషయాలు కూడా చంద్రబాబు డ్యాష్ బోర్డులో సిద్ధంగా ఉన్నాయి. కానీ, చర్యలుతీసుకోలేదు. అంతకు మించి.. మౌనంగా ఉన్నారు. దీని అర్థం బోధ పడక నాయకులు తల్లడిల్లుతున్నారు.
అంతేకాదు.. ఇప్పుడు నోరు విప్పేందుకు కూడా సాహసించడం లేదు. ఈ ఫలితం ఇతర నాయకులపై కూడా పడింది. ఎవరూ తప్పులు చేసేందుకు, నోరు విప్పించేందుకు కూడా ముందుకు రాలేక పోతున్నా రు. “వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.“ అని కొందరు ఎదురు చూస్తున్నారు. ఇక, వివాదాల్లో చిక్కుకున్నవారిని పార్టీలో పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. వారి మాటకు కూడా వాల్యూలేకుండా పోయింది. సో.. మౌనంగా ఉన్న చంద్రబాబు ప్రత్యక్ష చర్యల కన్నా కూడా పరోక్షంగా.. వారికి బలమైన పనిష్మెంటే ఇచ్చారని.. ఇంతకన్నా ఒక నాయకుడికి ఏం కావాలని.. ఇకనైనా వారు మారాలని సీనియర్లు చెబుతున్నారు. అదే చర్యలు తీసుకుని సస్పెండో.. మరొకటో చేసి ఉంటే..ఇతర నాయకులు కూడా.. ఇదే బాట పడతారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలా.. మౌనంగా ఉండి కూడా సాధించవచ్చన్న కీలక సూత్రాన్ని చంద్రబాబు ఫాలో అవుతుండడం గమనార్హం.


















