టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, మహిళా జర్నలిస్టు అడిగిన క్వశ్చన్ హాట్ టాపిక్ గా మారింది. “సినిమాలో మీరు ఇద్దరు హీరోయిన్లతో నటించారు. నిజ జీవితంలోనూ మీరు ఉమనైజరా?” అని అడగ్గా.. ఇది వ్యక్తిగత ఇంటర్వ్యూ కాదు కదా అని సిద్ధు సమాధానమిచ్చారు.
తాజా విలేకరులు ఆ ప్రస్తావన తీసుకురాగా.. సిద్ధు రియాక్ట్ అయ్యారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధు ఆ అంశంపై స్పందించారు. “మైక్ ఉంది కదా అని చెప్పి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. దానికి ఏం రియాక్ట్ అవ్వాలో నాకు నచ్చలేదు. దానిని దాటవేశా. ట్రైలర్ వల్ల బజ్ వచ్చింది. పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమా అనే విషయం మర్చిపోతున్నారా.. పర్సనల్ మైక్ పట్టుకుని.. హీరో ఉన్నాడని ఆన్సరబుల్ పొజిషన్ లో ఉంటే అలా అనేయడం కరెక్ట్ కాదు. వాళ్లకు వాళ్లే రియలైజ్ ఇవ్వాలి. కూర్చుని మైక్ పట్టుకుంటే పవర్ ఫీలవుతున్నారు. ముందు ఒకలా.. తర్వాత ఒకలా ఉన్నారు. ఇది హెల్తీ వాతావరణం మాత్రం కాదు” అని అన్నారు.
“నా ఒపీనియన్ ఏం ఉండదు. అడిగే వాళ్ళని అడగండి. నాతో ఎవరైనా అలాంటి మాట అది నా క్యారెక్టర్ కాదు.. వాళ్ల క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా. పక్కన పెట్టా. దాని కోసం మర్చిపోవాలి. నేను ఏ స్టాండ్ పై లేను. అది తప్పో కాదో ఆమెనే తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా పర్లేదు. అందరూ గౌరవం మెయింటైన్ చేయాలి. అందరితో మాట్లాడితే చిల్ గా ఉంటుంది. అన్ హెల్తీ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు” అని సిద్ధు తెలిపారు. “సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయినంత మాత్రాన.. బయట కూడా ఎన్‌కౌంటర్ చేస్తుంటాడా?” అని క్వశ్చన్ చేశారు.
ఆ తర్వాత సినిమాలో హర్ష కామిక్ టైమింగ్ కోసం మాట్లాడారు. తెలుసు కదాలో చాలా హ్యూమర్ ఉంటుందని, కానీ కామెడీ ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్పారు. హర్ష క్యారెక్టర్ అప్పుడప్పుడు నవ్విస్తుంటుందని వెల్లడించారు. అనంతరం ట్రైలర్ డిలేపై క్లారిటీ ఇచ్చారు. “సోషల్ మీడియాలో ఎందుకు లేటైందో నాకు తెలియదు. ముందు ఓ ట్రైలర్ కట్ చేశాం. వైజాగ్ లో లాంఛ్ అనుకుంటే క్యాన్సిల్ అయింది. సడెన్ గా ట్రైలర్ చూశాక నచ్చలేదు. మళ్లీ కట్ చేసి రిలీజ్ చేశాం” అని చెప్పారు.