హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకసారి చీర గానీ లేక లంగా వోనిలో గానీ కనిపిస్తే మాత్రం వారి అందాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావు. అంత అద్భుతంగా కనిపిస్తారు.. మామూలుగా చీరకట్టులోనే అందం ఉట్టి పడుతుంది. అలాంటిది హీరోయిన్లు ఇలాంటి చీరకట్టులో మెరిస్తే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. అయితే తాజాగా అలాంటి చీరలోనే మెరిసింది సౌత్ హీరోయిన్ శృతిహాసన్.. తాజాగా శృతిహాసన్ చీరకట్టులో తన ట్రెడిషనల్ స్టైల్ తో మెస్మరైజ్ చేసింది.
తాజాగా శృతిహాసన్ సిల్వర్ కలర్ శారీలో మెరిసింది.. సిల్వర్ కలర్ శారీ తో బ్లాక్ కలర్ బ్లౌజ్ ని పెయిర్ చేసి, తన లుక్ ని మరింత ఎలిగేంట్ గా మార్చింది.. సిల్వర్ కలర్ శారీ కి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న జరీ బార్డర్ ట్రెడిషనల్ వైబ్ ని తీసుకువచ్చింది.. శృతిహాసన్ చీరలో ఉన్న ఫోటోలు ఆమె లుక్ కి మరింత రిచ్ నెస్ ని యాడ్ చేసాయి. చీర యొక్క సిల్వర్ టోన్ శృతిహాసన్ అందాన్ని రెట్టింపు చేసింది అని ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. అలా అద్భుతమైన చీరలో కుందనపు బొమ్మలాగా ఉన్న శృతిహాసన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేయడంతో పాటు ఈమె అందానికి ఎంతోమంది బానిసలైపోతున్నారు.
చాలామంది హీరోయిన్లు తమలో ఉన్న బోల్డ్ నెస్ ని చూపించడానికి పొట్టి పొట్టి బట్టలు స్టైల్ చేస్తారు. కానీ ఇలాంటి చీరకట్టులోనే వారి అందం మరింత అద్భుతంగా కనిపిస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు. శృతిహాసన్ అలా తన కట్టు బొట్టుతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అలాగే ఈ ఫోటోలకు బ్లాక్ కలర్, వైట్ కలర్ హార్ట్ ఎమోజీలను క్యాప్షన్ గా పెట్టింది.
శృతిహాసన్ సినిమాలు, కెరియర్ విషయానికి వస్తే.. విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ సొంతంగా ఎదిగింది. మల్టీ టాలెంటెడ్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో హీరోయిన్ గానే కాదు సింగర్ గా కూడా కొన్ని పాటలు పాడింది.
అలా లక్ అనే మూవీతో బాలీవుడ్ లో మొదటిసారి హీరోయిన్ గా ఇమ్రాన్ ఖాన్ సరసన మెరిసినప్పటికీ ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈమె నటించిన అనగనగా ఓ ధీరుడు, బాలీవుడ్ లో దిల్ తో బచ్చా హై జీ,7 ఓం అరివు, ఓ మై ఫ్రెండ్, 3 వంటి వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో శృతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసారు.కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ చేసిందో అప్పటినుండి ఈమె దశ తిరిగిందని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణిస్తోంది.ఇక ఈ హీరోయిన్ ఈ ఏడాది కూలీ అనే మూవీతో మన ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో సలార్-2 సినిమా ఉంది.అలాగే అడివి శేష్ డెకాయిట్ మూవీలో నటించి కొంతవరకు షూటింగ్ అయ్యాక ఏవో కారణాలవల్ల అందులో నుండి తప్పుకోవడంతో శృతిహాసన్ ప్లేస్ ని మృణాల్ ఠాకూర్ రీప్లేస్ చేసింది.