కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఎంత స్ట్రైట్ ఫార్వార్డ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ఏ విషయం అయిన నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. మల్టీ టాలెంటెడ్ అయిన శృతి హాసన్ టీనేజ్‌లో ఉన్నప్పుడే సింగర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను కూడా రూపొందించింది. ఈ క్రమంలోనే ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ అనే హిందీ చిత్రంలో నిపించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో శృతి హీరోయిన్‌గా జర్నీని స్టార్ట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ చిత్రం శృతి హాసన్ ఫేట్‌ని మార్చేసింది అని చెప్పాలి.
కుర్ర హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతో కూడా శృతి హాసన్ సినిమాలు చేస్తుంది. ఆ మధ్య ప్రభాస్‌తో ‘సలార్’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. త్వరలో సలార్2తో సందడి చేయనుంది. అయితే కెరీర్ పరంగా శృతికి పెద్ద సమస్యలేమి లేవు కాని పర్సనల్ లైఫ్‌లోనే డిస్ట్రబెన్స్ ఎక్కువ అవుతుంది. అప్పట్లో విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఈ అమ్మడు అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. దాంతో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి చేసుకుంటారని అంతా అనుకోగా, కొద్ది రోజులకే వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు.మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం కొనసాగించింది.
అతడితో ఎంజాయ్ చేసిన ఫొటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. అతడితో రొమాంటిక్‌గా గడిపింది. కాని ఎందుకో ఏమో శాంతనుకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చకపోవడంతో ‘సర్జరీ’ చేయించుకున్నాను అని తెలిపింది. ఇక ముఖం మరింత అందంగా కనిపించేందుకు పిల్లర్స్ కూడా వాడాను. కొంత మంది వీటిని బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను కానీ నాలా దైర్యంగా చెప్పే వాళ్ళని ఎందుకు తప్పుపడతారో అర్ధం కాదు. అవసరమైతే ఫ్యూచరల్‌లో ‘ఫేస్ లిఫ్ట్’ కూడా చేయించుకుంటానేమో. అవి పూర్తిగా నా వ్యక్తి గత నిర్ణయాలు. ఇతరులకీ ఇబ్బంది లేనప్పుడు నా శరీరం విషయంలో నేను ఏ నిర్ణయమైన తీసుకుంటాను అని పేర్కొంది శృతి.